ఆంధ్రప్రదేశ్‌

సఖ్యతతోనే సాధించుకుంటాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 14: కేంద్రంలో సఖ్యతగా ఉంటూనే అక్కడి నుంచి రావల్సిన నిదులు, హోదా సాధించుకుంటామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలియచేశారు. శనివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు లేఖ రాయలేదని కేంద్ర పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉందని అంటూ, ఆయన రాసిన లేఖలను మీడియా ముందుంచారు. రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని పదేపదే కోరుతునే ఉన్నామని అన్నారు. హోదా ఇస్తామని కేంద్ర పెద్దలు పదేపదే చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, హోదా గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 17న ఢిల్లీ వెళ్లి మరోసారి కోరనున్నారని ఆయన చెప్పారు.
రాష్ట్రానికి కేంద్రం అంతంతమాత్రంగానే నిధులు ఇచ్చిందని యనమల చెప్పారు. 2015-16 ఆర్థిక లోటు భర్తీలో కేంద్రం ఇచ్చిన నిధుల్లో వెయ్యి కోట్లు తగ్గాయని ఆయన చెప్పారు. రాష్ట్రానికి 1.43 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చెపుతోంది. ఇవేవీ రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ఇచ్చినవి కావని ఆయన అన్నారు. రాష్టల్రో రోడ్ల నిర్మాణానికి 65 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు. ఇవి ప్రైవేటు కంపెనీలకు ఇస్తారని, రోడ్లను పిపిపి, లేదా బిఓటి పద్ధతిలో నిర్మిస్తారని ఆయన తెలియచేశారు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ కేంద్రం 6000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఇచ్చిందని ఆయన తెలిపారు.
కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి త్రైమాసిక, అర్థ సంవత్సర, సంవత్సర లెక్కలను అసెంబ్లీలో చూపిస్తున్నామని, ప్రత్యేకించి శే్వత పత్రం విడుదల చేయక్కర్లేదని యనమల స్పష్టం చేశారు. ఇప్పటికీ లెక్కలు చెప్పమని కోరితే, చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యనమల చెప్పారు. బిజెపి, టిడిపికి మధ్య విబేధాలు ఉన్నాయని, ఈ రెండు పార్టీలూ దూరమైపోతాయని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో వివాదాలకు దిగదని, సఖ్యతతో ఉంటూనే అన్ని సాధించుకుంటాయని చెప్పారు.
అప్పుల పరిధి పెంచని కేంద్రం
ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 15 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఈ ఏడాది 24 వేల కోట్ల రూపాయలు రుణానికి వెళుతున్నామని యనమల తెలియచేశారు. ఏటా వడ్డీయే 9000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని అన్నరు. ఫిజికల్ డెఫిషిట్ మూడు శాతానికి మించకూడదని, విధిలేని పరిస్థితుల్లో ఇది 3.7 శాతానికి చేరుకుందని, పరిధి దాటేందుకు కావల్సిన అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా, ఇప్పటి వరకూ స్పందించలేదని యనమల అన్నారు.