జాతీయ వార్తలు

సోనియాకు శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం 69వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌తోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు ఈ రోజు ఉదయం 10, జనపత్‌కు వెళ్లి ఆమెకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు ఎం.ఏ.ఖాన్ తదితరులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, నంది ఎల్లయ్య, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, మధు యాష్కి, మాజీ మంత్రి జి.వినోద్ సోనియా గాంధీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకుంటూ, చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని శుభాకాంక్షలు తెలిపారు.

సోనియా, రాహుల్ జైలుకే
బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నూటికి నూరుశాతం జైలుకెళ్లడం ఖాయమని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఈ కేసు విషయంలో ఎలాంటి వేధింపులు లేవని చట్టప్రకారమే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. దీన్ని ప్రధాని కార్యాలయం నుంచి జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపేనంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు ఖండించారు. అసలు ఈ కేసు గురించి పిఎంవోకు గాని, బిజెపి నాయకత్వానికి గాని తాను ఇంతవరకూ వివరించలేదని తెలిపారు. ఈ కేసును ఎదుర్కొనే విషయంలో తనకు ఎవరి మద్దతూ అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ నేత చిదంబరాన్ని‘సబ్ స్టాండర్డ్’లాయర్‌గా స్వామి అభివర్ణించారు. ‘చిదంబరాన్ని ఇతరులు ఏ విధంగా భావిస్తారో నాకు తెలియదు కాని నా దృష్టిలో మాత్రం ఆయన పసలేనని న్యాయవాది’ అని బిజెపి నేత వ్యాఖ్యానించారు.

విషమంగానే బర్దన్ ఆరోగ్యం
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం గుండెపోటుకు గురైన బర్దన్‌ను జిబి పంత్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. బర్దన్‌కు మెదడులో రక్తస్రావం అయినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రియతమ నేత త్వరగా కోరుకోవాలని ఆకాంక్షిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర శాఖల నుంచి ఫోన్లు వస్తున్నాయని సిపిఐ వర్గాలు తెలిపాయి. దేశ విదేశాల నుంచి ఫోన్ చేసి బర్దన్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, సిపిఎం నేత ప్రకాశ్ కారత్, పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ సహా పలువురు ప్రముఖులు జిబి ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు.
బర్దన్ కుమార్తె అల్కా బారువా ఆసుపత్రిలోనే ఉండి తండ్రికి సేవలు చేస్తున్నారు. 92 ఏళ్ల బర్దన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా స్పష్టం చేశారు.