ఆంధ్రప్రదేశ్‌

ఔట్‌సోర్సింగ్ ఆకలి కేకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ప్రైవేటు సంస్థలు జీతాలు జాప్యం చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తే ఆ చిరుద్యోగులు ఎవరితో గోడు వెళ్లబోసుకోవాలి? జీతాలందక, కడుపులు నిండక చివరకు ఆత్మహత్యలే శరణ్యమంటున్న ఆ చిరుద్యోగుల కష్టాలు కడతేర్చేది ఎవరు? ఈ దయనీయ గాథ ఏ ఏజెన్సీ ప్రాంతాల్లోనో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. గుంటూరు జిల్లాలో 3నెలల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనమిది. గుంటూరు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 3వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 3 నెలల నుంచి జీతాలు లేక అలమటిస్తున్నారు. స్వీపర్లు, ఆపరేటర్లు, డ్రైవర్లు, క్లర్కులు, సూపర్‌వైజర్ స్థాయి చిరుద్యోగులు. వీరికి రూ.8,500 నుంచి 11,500 వరకూ వేతనం, పిఎఫ్, ఇఎస్‌ఐ కట్ చేసి మిగిలిన జీతం ఇస్తారు. ప్రభుత్వం వీరికి నేరుగా జీతాలు చెల్లించదు. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు జీతాలు విడుదల చేస్తే, వాటి నుంచి ఇఎస్‌ఐ, పిఎఫ్ కట్ చేసి మిగిలిన సొమ్మును ఏజెన్సీలు ఉద్యోగులకు చెల్లిస్తుంటాయి. గత 3 నెలల నుంచి ప్రభుత్వం ఏజెన్సీలకు డబ్బు చెల్లించకపోవడంతో, వారు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. తమ జీతాల సంగతి ఏమయిందని ఉద్యోగులు ప్రశ్నించడం, తమకు ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు అందలేదని ఏజెన్సీలు సమాధానం చెప్పడం గత మూడు నెలల నుంచి కొనసాగుతోంది. ఏజెన్సీలకు తిరిగి రెన్యువల్ చేయకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ రకంగా గత 3 నెలల నుంచి దాదాపు 3 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు సుమారు 3 కోట్ల రూపాయల జీతాలు నిలిచిపోయాయి. అంటే దాదాపు 9 కోట్ల రూపాయల బకాయిలు నిలిచిపోయినట్లు స్పష్టమవుతోంది.