రాష్ట్రీయం

పావలావడ్డీ ‘గోవిందా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: తెలంగాణలో ‘రైతన్న రాజ్యం’ సంగతి ఎలా ఉన్నా రాష్టవ్య్రాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రుణమాఫీ పథకం, వడ్డీలేని రుణాల బాపతు లాభం రైతులకు అందకుండా పోతోంది. 2015 ఖరీఫ్ పంటకు సంబంధించిన వడ్డీలేని రుణాల నిధులు ప్రభుత్వంనుండి బ్యాంకర్లకు ఇప్పటివరకు చేరలేదు. దాంతో ‘తొలుత మీరు చెల్లించండి, సర్కారు నిధులు ఇస్తే మీ ఖాతాలో జమ చేస్తాం’ అంటూ రైతుల నుండి రుణాలను వడ్డీతో సహా బ్యాంకర్లు వసూలు చేస్తున్నారు.
2015 ఖరీఫ్‌లో రాష్టవ్య్రాప్తంగా రైతులకు దాదాపు 15 వేల కోట్ల రూపాయలు పంట రుణాలుగా బ్యాంకుల ద్వారా అందాయి. వర్షాలు సరిగా లేకపోవడం, పంటలు పండకపోవడంతో రాష్ట్రంలోని 231 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మండలాల్లో రైతులు తీసుకున్న పంటరుణాలు దాదాపు10 వేల కోట్ల రూపాయలుగా ఉన్నట్టు తేలింది. ఈ రుణాలు రీషెడ్యూల్ కావడంతో వడ్డీలేని రుణాల పథకం మూడో విడత వీటికి వర్తించే పరిస్థితి లేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం లక్ష రూపాయలలోపు పంట రుణాలుగా తీసుకున్న రైతులు చెల్లించాల్సిన వడ్డీని ప్రభుత్వమే గత ఐదేళ్ల నుండి చెల్లిస్తూ వస్తోంది. కరవుపీడిత ప్రాంతాల్లో 2015 ఖరీఫ్‌కు సంబంధించి లక్షలోపు రుణాలపై ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిన దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు మిగులుతున్నాయి. అదే సమయంలో 2015 ఖరీఫ్ రుణాలు రీషెడ్యూల్ చేయడంతో రైతులపై రుణ భారం పెరిగింది. రుణాలు రీషెడ్యూల్ కావడంతో నిబంధనల ప్రకారం బ్యాంకర్లు 12 శాతం వడ్డీని రైతులనుండి వసూలు చేస్తారు. ఈ రకంగా దాదాపు 1200 కోట్ల రూపాయలు వడ్డీగా బ్యాంకులకు రైతులు చెల్లించాల్సి వస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం 2014 లో ప్రకటించిన పంటల రుణమాఫీ కింద 34 లక్షల మంది రైతులకు 17000 కోట్ల రూపాయలు మాఫీ జరుగుతోంది. నాలుగు సంవత్సరాల్లో నాలుగు దశల్లో ఈ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తామంటూ ప్రభుత్వ ప్రకటించింది. ఈ ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే ఎనిమిది వేల కోట్లకుపైగా బ్యాంకులకు చెల్లించారు. ఇవి రైతుల ఖాతాల్లో జమఅయ్యాయి. ఈ పర్యాయంకూడా మూడో విడతలో రుణమాఫీ నిధులు 4000 నుండి 4500 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధులను బ్యాంకుల్లో రైతుల అకౌంట్లకు చేర్పించే ప్రహసనం నడుస్తోంది. రుణమాఫీ అమలు కోసం ఇప్పటికే రెండు పర్యాయాలు పరిశీలన చేయించిన ప్రభుత్వం మూడో పర్యాయం ప్రతి బ్యాంకులో ప్రతి రైతు అకౌంట్‌ను పరిశీలన చేస్తోంది. మొదటి, రెండో విడతల్లో ప్రభుత్వ విడుదల చేసిన రుణమాఫీ నిధుల్లో దాదాపు 150 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఇవి బోగస్ పేర్లా అన్న అంశంపై పరిశీలన చేస్తున్నారు.
ఇలా ఉండగా కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన మండలాలు మినహా మిగతా మండలాల్లో వడ్డీలేని రుణాలు క్లిష్టతరంగా మారాయి. 2015 మార్చి వరకు వడ్డీని ప్రభుత్వం ఇప్పటివరకు బ్యాంకులకు చెల్లించకపోవడంతో రైతుల నుండి బ్యాంకర్లు తొలుత వడ్డీని వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు. ఈ విధంగా వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచి మేనేజర్ ఒకరు ఆంధ్రభూమితో చెప్పారు. కాగా, రుణమాఫీ, వడ్డీలేని రుణాలకు సంబంధించి ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు ఎం. శ్రీధర్‌రెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు.