ఆంధ్రప్రదేశ్‌

బాబూ..మీకు ఎన్ని క్యాంపు ఆఫీసులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివసించే శేరిలింగంపల్లిలోని మదీనాగూడలోఉన్న ఇంటికి రెసిడెన్స్ క్యాంప్ ఆఫీస్ హోదాను ఇస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో 114ను జారీ చేసింది. రాష్టవ్రిభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో గత రెండేళ్లలో మూడో ఇంటికి ఈ హోదా లభించింది. తొలుత జూబ్లీహిల్స్‌లోని సొంత గృహంలో చంద్రబాబు ఉండేవారు. పునర్నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఈ ఇంటికి తొలుత రెసిడెన్స్ క్యాంప్ ఆఫీస్ హోదా ఇచ్చారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లో మారిన ఇంటికి కూడా ఇదే హోదా ఇచ్చారు. తాజాగా ఈ ఇంటి నుంచి మదీనాగూడలోని ఫాంహౌస్‌లో ఉన్న ఇంటికి మారారు. ఈ ఇంటికి రెసిడెన్స్ హోదా ఇచ్చారు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఇకపై ఈ ఇంట్లోనే బస చేస్తారు. మదీనాగూడలోని ఇంటికి రెండు కోట్ల నిధులు ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఏప్రిల్ 1వ తేదీన 1.36కోట్ల రూపాయలు, ఏప్రిల్ 6వ తేదీన రూ. 57 లక్షలు ఈ ఇంటి ఆధునీకరణ, మరమ్మతులు, భద్రత దృష్ట్యా విడుదల చేశారు. గతంలో జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబర్ 24, 65లో ఉన్న ఇళ్లకు కూడా రెండు కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసి మరమ్మతులు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో చంద్రబాబుకు రాజ్‌భవన్‌కు పక్కనే ఉన్న లేక్‌వ్యూ విశ్రాంతి భవనం కేటాయించారు. దీనికి రూ. 45 లక్షలతో మరమ్మతులు చేశారు. ఇప్పుడా భవనంలో ఎవరూ లేరు. కొంతకాలం లేక్‌వ్యూ విశ్రాంతి భవనం సిఎంఓ కార్యాలయంగా ఉంది. ఇక్కడ సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కోసం హెచ్, ఎల్ బ్లాక్‌లో కొన్ని భవనాలను 21 కోట్ల రూపాయలతో ఆధునీకరించారు. ఈ మధ్య కాలంలో వాటిని ఉపయోగించడం లేదు. ఆ తర్వాత విజయవాడలో సిఎంఓ ఆఫీసును, ఉండవల్లి వద్ద సిఎం నివాస గృహం మరమ్మతులు, ఆధునీకరణ, భద్రత పటిష్టతకు రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించింది. త్వరలో వెలగపూడి వద్ద నిర్మించనున్న సచివాలయం కాంప్లెక్స్‌లోనే సిఎం నివాస గృహం రానుంది.