రాష్ట్రీయం

హోదా లేదా ప్యాకేజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ విజయవాడ, మే 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కరవు సహాయం గురించి చర్చించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, నీట్ వంటి కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీకి వస్తున్న చంద్రబాబు మధ్యాహ్నం పనె్నండున్నర గంటలకు సౌత్ బ్లాక్‌లో ప్రధాన మంత్రితో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న కరవు గురించి వివరించి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు కేంద్రం చేయవలసిన సహాయం గురించి వివరించనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం విజయవాడలో పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై ప్రధాన మంత్రితో చర్చించవలసిన అంశాలపై సమాలోచనలు జరిపారు. కరవు నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చంద్రబాబు అన్నారు. కేంద్రం అండగా నిలిస్తేనే పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయగలుతామని అన్నారు. ఈ సందర్భంగా ఇంతవరకూ కేంద్రం అందించిన సాయంపై అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. 2015లో వచ్చిన కరవుపై కేంద్రాన్ని 2,005.56 కోట్లు సాయం కోరాగా 433.77 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని, అందులో 319.95 కోట్లు మాత్రమే విడుదల చేసిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే భారీ వరదలు, వర్షాలవల్ల గత ఏడాది 5,129.35 కోట్ల రూపాయల నష్టం జరిగితే కేంద్రాన్ని 3.501.63 కోట్లు సాయంగా అందించమని కోరామని, కానీ కేంద్రం మంజూరు చేసింది 280.19 కోట్లు మాత్రమేనని అధికారులు చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిందిగా మెజారిటీ నాయకులు ముఖ్యమంత్రికి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే చంద్రబాబునాయుడుకు స్పష్టం చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదంటూ ఎన్‌డిఏ ప్రభుత్వం స్పష్టం చేయటం కేవలం ముఖ్యమంత్రికే కాదు తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులకు బాగా తెలుసు. అయితే వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, ప్రతిపక్షం నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాను రాజకీయాంశంగా మార్చివేయటంతో చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూనే ప్రత్యేక ప్యాకేజీ సాధించటంపై ఆయన దృష్టి సారిస్తున్నారు. అయితే ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి కూడా ఒప్పుకుంటుందా? లేదా? అనే అనుమానం చంద్రబాబును పీడిస్తోంది. అందుకే ఆయన రేపు నరేంద్ర మోదీతో కరవుపరిస్థితులు, కేంద్రం అందజేయవలసిన సహాయం గురించి చర్చించిన అనంతరం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి చర్చించే అవకాశాలున్నాయి. చంద్రబాబు వీలుంటే నరేంద్ర మోదీతో ఏకాంతంగా సమావేశమై ప్రత్యేక హోదా పేరుతో జగన్ చేస్తున్న రాజకీయం గురించి చర్చించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే జగన్ రాజకీయాన్ని తిప్పికొట్టేందుకు అవకాశం ఉంటుందని ఆయను ఎన్‌డిఏ అధినాయకత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు.

చిత్రం సోమవారం విజయవాడలో మంత్రులు, అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు