రాష్ట్రీయం

మీ చదువుకు మాదీ పూచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపక సిబ్బంది కొత్త పాఠాలు చెబుతున్నారు. లక్షలు భరిస్తూ కార్పొరేట్ కాలేజీల్లో ఎందుకు చేర్పిస్తారు. అంతకుమించి నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తాం. ప్రభుత్వ కాలేజీల్లో చేరండంటూ ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలను పరిరక్షించుకుందామంటూ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రత్యేక ప్రచార కార్యాచరణ రూపొందించి అన్ని జిల్లాల్లో అమలుకు నడుంకట్టింది. ప్రభుత్వ కాలేజీల్లో చదువు ఉచితం. మధ్యాహ్న భోజనం ఉచితం. పుస్తకాలు ఉచితం. పరీక్ష ఫీజు రెండొందలు వినా మరే ఫీజులూ చెల్లించాల్సిన పని లేదు. అదే ప్రైవేటు కాలేజీల్లో అయితే లక్షలాది రూపాయిల ఫీజుల భారం మోయాలి. తల్లిదండ్రులు ఇన్ని ఇబ్బందులు భరించాలా? రండి ప్రభుత్వ కాలేజీల్లో పల్లల్ని చేర్పించండి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇంతకాలం ప్రైవేటు కాలేజీల్లో చేరడానికి ఇంగ్లీషు మీడియం తపన తల్లిదండ్రులకు ఉండటమేనని గుర్తించిన ప్రభుత్వం, ఈ ఏడాది నుంచి ప్రభుత్వ కాలేజీల్లో సైతం ఇంగ్లీషు మీడియంను చేర్చింది. అంతేకాదు, తమ సత్తా ఏమిటో కూడా ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీలు చాటుకున్నాయి. గత ఏడాదికంటే అధికంగా మూడు శాతం ఫలితాలు సాధించి కార్పొరేట్ కాలేజీలకు ఏమాత్రం తీసిపోయేది లేదని చాటిచెప్పాయి.
పెరిగిన సౌకర్యాలు ఇంటింటికీ వెళ్లి విద్యార్ధులను కార్పొరేట్ కాలేజీలు ప్రలోభ పెడుతుండగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సిబ్బంది మాత్రం విద్యార్థులను తమ కాలేజీల్లో మాత్రమే ఎందుకు చేర్చాలో విడమరచి చెబుతున్నారు. అదనపు క్లాసులు, ఇంగ్లీషలో బోధన, బలహీనంగా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక శిక్షణ, ఇలా ఏ విషయంలోనూ తీసిపోని రీతిలో ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన బోధన సదుపాయాలు ఉన్నాయని వివరిస్తున్నట్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. మరోపక్క బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, విరామ మందిరాలు, అన్ని సబ్జెక్టులకు బోధన సిబ్బంది నియామకం వంటి చర్యలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేపట్టారని, కాలేజీలకు వెల్ల వేయడం, ఇతర మరమ్మతులు, ల్యాబ్‌లలో సౌకర్యాలు, లైబ్రరీల్లో ఎస్సీ, ఎస్టీ , బీసీ పిల్లలకు ఉచిత బుక్ బ్యాంకు సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రభుత్వ కాలేజీలకు మంచి పేరు వచ్చిందని, ఈ వేసవిలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మధుసూధనరావు వివరించారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడం వల్ల తండాల్లో సైతం ఇంటింటికీ వెళ్లి విద్యార్ధులకు, తల్లిదండ్రులకు సైతం వివరించి చెబుతున్నట్టు పేర్కొన్నారు. గతంలో ఆర్టీసీకి సైతం ఆక్యుపెన్సీ సమస్య వస్తే సిబ్బంది కృషి చేసి దాన్ని అధిగమించారని, ఇపుడు ప్రభుత్వ కాలేజీలకు సైతం ఆక్యుపెన్సీ సమస్య వచ్చిందన్నారు.
అర్హులకు మూడు రెట్లు సీట్లు
రాష్ట్రంలో 3వేల వరకూ జూనియర్ కాలేజీలు ఉంటే దాంట్లో 15.52 లక్షల వరకూ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలు, 250కి పైగా రెసిడెన్షియల్ స్కూళ్లలో 9 లక్షల వరకూ సీట్లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది టెన్త్ పాసైన విద్యార్థుల సంఖ్య 4.5 లక్షల మాత్రమే. దాంతో లక్షన్నర వరకూ ప్రభుత్వ కాలేజీల్లో చేరుతుండగా, మిగిలిన వారు ప్రైవేటు కాలేజీలపై మొగ్గు చూపుతున్నారు. 3 వేల జూనియర్ కాలేజీల్లో వంద వరకూ కాలేజీలకు గుర్తింపు దక్కలేదు. దాంతో ఆ సంఖ్య 2900కు తగ్గింది. అందులో ప్రభుత్వ కాలేజీలు, రెసిడెన్షియల్, ఎయిడెడ్ కాలేజీలు పోనూ 2200 వరకూ ప్రైవేటు రంగంలో ఉండగా అందులో కేవలం 1700 కాలేజీలకే అఫిలియేషన్ దక్కింది.
ఫలించిన కృషి
ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల పెంపునకు రెండేళ్లక్రితం ప్రారంభించిన ప్రయత్నాలు గత ఏడాది సత్ఫలితాలు ఇచ్చాయి. గత ఏడాది అడ్మిషన్ల శాతం పెరగ్గా, ఈ ఏడాది మరింత పెంచాలని నిర్ణయించారు. ఇందుకు సంఘం నేతలు ప్రధాన కార్యదర్శి బాబూరావు, అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణకుమార్‌లతో కలిసి మధుసూధనరెడ్డి చేసిన కృషి సత్ఫలితాలు ఇచ్చింది. చాలామంది విద్యార్ధులు ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని వారు చెప్పారు. దీన్ని ప్రతి జిల్లాలో ఉద్యమంలా చేపట్టామని వివరించారు.

చిత్రం విద్యార్థులను ఆకర్షించేందుకు లెక్చరర్లు సిద్ధం చేసిన పోస్టర్లు