రాష్ట్రీయం

జాబాలి తీర్థంలో జెండా కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 16: తిరుమలలో పాపవినాశనానికి వెళ్లే మార్గంలోని జాబాలి తీర్థం ప్రవేశమార్గంలోని ఆర్చిపై కనిపించిన జెండా సోమవారం తిరుమలలో తీవ్ర కలకలం రేపింది. త్రిభుజాకారంలోని శే్వత వస్త్రంపై పచ్చటి నెలవంక, నక్షత్రం ముద్రించి ఉన్న జెండా జాబాలి తీర్థం వెళ్ళే మార్గంలో ఆర్చిపై ఎగురుతూ ఆదివారం దర్శనమిచ్చింది. ఈ జెండా ఇస్లాం మతానికి చెందినదిగా మొదట అనుమానించిన టిటిడి విజిలెన్స్ అధికారులు జెండాను తొలగించారు. అయితే అది మహబూబ్‌నగర్ జిల్లా గిరిజన తండానుంచి వచ్చిన భక్త బృందం ఆంజనేయస్వామిని దర్శించుకునే సమయంలో తాము తండా జెండాను అక్కడ ఉంచి వెళ్లిఉంటారని, జెండా హిందూ గిరిజన తండాలకు సంబంధించినదిగా హథీరాంజి మఠం పీఠాధిపతి అర్జున్ దాస్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక జాబాలి తీర్థం వెళ్ళే మార్గంలో ఆర్చిపై త్రిభుజాకారంలోని తెల్లటి వస్త్రంపై పచ్చటి రంగులోని నెలవంక, నక్షత్రం ముద్రించి ఉన్న జెండాను ఎగరేసి వెళ్ళారు. జాబాలి తీర్థంకు వెళ్తున్న భక్తుల నుంచి విషయం తెలుసుకున్న కొంత మంది విలేఖరులు సోమవారం ఉదయం టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సిబ్బందిని వెంటబెట్టుకుని సంఘటనా స్థలానికి చేరుకుని జెండాను అక్కడి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా టిటిడి విజిలెన్స్ సెక్టార్-3 ఎ వి ఎస్ ఓ వెంకటాద్రి విలేఖరులతో మాట్లాడుతూ ఇది ఇస్లాం మతానికి చెందిన జెండాగా అనుమానించి తొలగించినట్లు తెలిపారు. తిరుమలలో ఇతర మతాలకు చెందిన ప్రతిరూపాలు, గుర్తులు, జెండాలు ప్రదర్శించకూడదనే నిబంధన ఉన్న కారణంగా జెండాను తొలిగించామని అయితే ఇది ఉరుసు ఉత్సవాల్లో ప్రదర్శించే జెండానా లేక మరేదైనా మతానికి చెందినదా అన్నది తేలాల్సి ఉందని అన్నారు. ఇదిలా ఉండగా జెండా చిత్రాలను చూసిన హథీరాంజి మఠం పీఠాధిపతి అర్జున్‌దాస్, మఠం సూపరింటెండెంట్ శ్రీనివాస్ జెండా మహబూబ్‌నగర్ జిల్లాలోని బంజారా తండాల నుంచి ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఆనవాయితీగా జెండాను నాటుతారని, ఇది వారి భక్తికి చిహ్నమని వెల్లడించడంతో జెండా వివాదం ముగిసింది.

chitram తిరుమల జాబాలి తీర్థం ఆర్చిపై ఎగురుతున్న జెండా (వృత్తాకారంలో)