రాష్ట్రీయం

ఔటర్ రింగ్‌రోడ్డులో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/విజయవాడ,మే 17: ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావుదంపతులు ప్రయాణం చేస్తున్న కారు సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ రింగ్ రోడ్డులో పహాడీ షరీఫ్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పిన్నమనేని సతీమణి సత్యవాణి (55), కారు డ్రైవర్ దాస్ అక్కడికక్కడే మరణించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వెంకటేశ్వరరావును అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా నందివాడ మండలం రుద్రపాక గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. సత్యవాణి మృతదేహాన్ని రోడ్డు మార్గాన స్వగ్రామానికి తరలించారు. వెంకటేశ్వరరావుబుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరానికి చేరుకోనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిన్నమనేని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. డ్రైవర్ కుటుంబ సభ్యులకు కూడా సిఎం సంతాపం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అయిన పిన్నమనేని గత ఎన్నికల అనంతరం తెలుగుదేశంలో చేరి ఆప్కాబ్ చైర్మన్ అయ్యారు. హైదరాబాద్‌లోనే ఉంటున్న పిన్నమనేని విజయవాడలో సమీప బంధువు ఇంట జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం భార్యతో కలిసి వచ్చారు. సోమవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ బయలుదేరారు. కారులో పిన్నమనేని ఒక్కరే సీటు బెల్ట్ ధరించి ఉన్నారని, ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్ కారణంగా నిరపాయంగా బయటపడ్డారని చెబుతున్నారు. ఆప్కాబ్ సంస్థ దాదాపు రూ.35 లక్షలతో ఇటీవల ఆ కారును కొనుగోలు చేసిందని, డ్రైవర్ ఆ సంస్థ ఉద్యోగి అని తెలుస్తోంది.
పల్టీలు కొట్టిన కారు
ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని దంపతులు ప్రయాణం చేస్తున్న కారు వేగంగా రావడం వల్ల ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని మూడు పల్టీలు కొట్టింది. సీటు బెల్టు ధరించక పోవడం వల్లే పిన్నమనేని భార్య, డ్రైవర్ మరణించినట్టు చెబుతున్నారు. పిన్నమనేని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అపోలో వైద్యులు తెలిపారు. పిన్నమనేని భార్య, కారు డ్రైవర్‌కు గాంధీ ఆసుపత్రిలో శరపరీక్షలు నిర్వహించారు. బుధవారం కృష్ణాజిల్లాలోని వారి స్వస్థలంలోనే అంత్యక్రియలు జరుగుతాయి.
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో మంగళవారం జరిగిన ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.
ఘటనా స్థలంలో ప్రాణాలు
కోల్పోయిన పిన్నమనేని సతీమణి