ఆంధ్రప్రదేశ్‌

‘కొవ్వాడ’కు లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 17: తుది దశకు ‘అణువు’ చేరుకుంటోంది. ప్రతిష్ఠాత్మకంగా భారత-అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జి.ఇ.కంపెనీ, వెస్టింగ్‌హౌస్ పర్యవేక్షణతో శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. పది వేల మెగావాట్ల సామర్థ్యంతో లక్ష కోట్ల రూపాయలతో దీనిని నిర్మిస్తున్నారు. ఇందుకు కీలకమైన మత్స్యకారుల సహకారం, వారి భూముల సేకరణలో మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర, రాష్ట్ర, జిల్లా అధికారులకు గంగపుత్రులు నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. సామాజిక ప్రభావిత మదింపు సర్వేను అధికారులు నిర్వహించేందుకు అంగీకరించారు. కానీ, భోగాపురం, అమరావతి ప్యాకేజీల కంటే మెరుగుగా ఇవ్వాలంటూ మత్స్యకార నాయకులు మైలిపల్లి పోలీసు, రాముడు, జగ్గులు, నర్సింహమూర్తి కొవ్వాడ ప్రజలు తరుఫున కోరారు. రణస్థలం మండలం కొవ్వాడ గ్రామంలో మంగళవారం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు మత్స్యకారులతో గ్రామసభ నిర్వహించారు. ముందు ఈ సభ రసాభాసగా మారినప్పటికీ, మత్స్యకార సంఘం నాయకులు అధికారుల మధ్య ఒప్పందాలు అనుకూలంగా మారడంతో అణువిద్యుత్ కేంద్ర నిర్మాణానికి కావల్సిన 2450 ఎకరాల భూసేకరణకు మార్గం సుగమమైంది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 600 ఎకరాలు రైతుల జిరాయితీ భూములకు, మత్స్యకారుల డి.పట్టా భూములకు ఇతరత్రా గల మొత్తం భూసేకరణకు ఎకరాలకు 13 లక్షల పది వేల రూపాయలుగా నిర్ణయించినట్టు అధికారులు మత్స్యకారులకు సుస్పష్టం చేశారు. దీనిపై వారంతా అనుకూలంగానే స్పందించారు. ఈ నేపథ్యంలో 2000 కుటుంబాలు రామచంద్రాపురం, కొవ్వాడ, చిన్న కొవ్వాడ, గూడెం గ్రామాలకు చెందిన కుటుంబాలను పునరావాసం కల్పించాల్సివుంది. వీరికి ఐదు సెంట్లు భూమి చొప్పున్న ఆరు లక్షల రూపాయలతో రెండు బెడ్‌రూంల కలిగిన ఇళ్ళు నిర్మించేందుకు ఎన్‌పీసీఐఎల్ ప్రత్యేక ప్యాకేజీని అనుమతించినట్టు ఆ ప్రతినిధులు పేర్కొనగా గంగపుత్రులు సుముఖత వ్యక్తం చేస్తూ అందరికీ ఒకే ప్రాంతంలో పునరావాసం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే నిర్వాసిత కుటుంబానికి ఒక ఉద్యోగం అణుపార్కులో ఇస్తామని లేనిపక్షంలో ఐదు లక్షల రూపాయలు ఇస్తామని, దానిని కాదంటే నెలకు 2000 చొప్పున్న 20 ఏళ్ళు పింఛన్ ఇస్తామంటూ స్పెషల్ ప్యాకేజీని రెవెన్యూ, అణుపార్కు ఇంజనీర్లు ప్రకటించారు. ఆ ప్యాకేజీపై మత్స్యకారులు అనుకూలంగానే స్పందించారు. వౌలిక మంత్రంతో 25 సౌకర్యాలు, సదుపాయాలతో పునరావాస కాలనీలు ఏర్పాటుతోపాటు, పునరావాసకాలనీ సమీపంలో జెట్టీ నిర్మాణానికి కూడా ఎన్‌పీసీఐఎల్ ప్రతినిధులు అంగీకరించారు. గతంలో నిలిచిపోయిన సామాజిక ప్రభావిత మదింపు సర్వేకు మత్స్యకారులు అనుమతించారు. రెండురోజుల్లో ఈ సర్వేను 14 బృందాలుగా రెవెన్యూ, సీసీఎల్ అధికారులు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీ శర్మ, సిటు రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు ఈ సభను అడ్డుకునే ప్రయత్నం చేయగా గంగపుత్రులే వారిని నివారించి, అధికారులతో మాట్లాడారు. అయినప్పటికీ కామ్రేడ్లు అణువిద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఎన్‌పిసిఐఎల్ దరఖాస్తునే సమర్పించకుండా గ్రామసభలు ఎలా నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు.

గ్రామసభలో అధికారులతో సిఐటియు నేత నర్సింగరావు వాగ్వాదం