తెలంగాణ

పాలేరుపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 18: పాలేరు ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 16వ తేదీన పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగగా 19వ తేదీన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ కోసం 14టేబుళ్ళు ఏర్పాటు చేస్తున్న అధికారులు 17 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు జరపనున్నారు. కాగా నియోజకవర్గ పరిధిలో 90శాతం పోలింగ్ నమోదు కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 13మంది అభ్యర్థులు పోటీలో నిలవగా ప్రధానమైన పోటీ టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి, సిపిఐ బలపర్చిన సిపిఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావు మధ్య పోటీ నెలకొన్నది. అయితే గ్రామీణ నియోజకవర్గమైన పాలేరులో పోలైన ఓట్లు 1,70,800 ఉండగా, 91వేల ఓట్లు మహిళలే వేశారు. దీంతో మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపితే వారే గెలుస్తారనే ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. అధికార టిఆర్‌ఎస్ పార్టీ తన ప్రధాన నేతలందరిని రంగంలోకి దింపి గతంలో ఎక్కడా, ఎవ్వరూ నిర్వహించని విధంగా ప్రచారం చేశారు. సుమారు నలుగురు మంత్రులు పూర్తిగా ఖమ్మంలోనే 15రోజుల పాటు మకాం వేసి పాలేరులో ప్రచారం నిర్వహించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీకి చెందిన మాజీమంత్రులు, ప్రధాన నేతలను ప్రచారానికి భారీగా ఉపయోగించింది. అటు సిపిఎం కూడా సిపిఐ నేతలతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో 11సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా రెండుసార్లు సిపిఎం విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించగా ఆయన అకస్మిక మరణంతోనే ఉప ఎన్నిక జరిగింది. పాలేరు నియోజకవర్గంలో ఓటర్లు ఈ దఫా ఓటు వేసేందుకు ఆసక్తి కనబర్చారు. ప్రధానంగా తాము ఎవరికి ఓటు వేశామో తెలుసుకునేందుకు వివిప్యాట్ విధానం అన్ని కేంద్రాల్లో దేశవ్యాప్తంగా తొలిసారి ఇక్కడే ప్రవేశపెట్టడం, మోడల్ పోలింగ్‌బూత్‌ల పేరుతో పోలింగ్ కేంద్రాలను అత్యంత అందంగా అలంకరించడం ప్రజల ఆకర్షణకు కారణంగా తెలుస్తోంది. కాగా ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ నెల 19వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 12గంటల వరకు పూర్త్ఫిలితం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు తమ శ్రేణులను మధ్యాహ్న సమయానికి ఖమ్మం చేరుకోవాలని, సంబురాల్లో పాల్గొనాలని కోరుతుండటం విశేషం. అయితే పోలీసులు మాత్రం ఎటువంటి ప్రదర్శనలకు, సభలకు అనుమతి లేదని చెప్పడం గమనార్హం.