హైదరాబాద్

1969 ఉద్యమకారులను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1969లో ఉద్యమించి పోలీస్ తూటాలకు బలైన, ప్రస్తుతం జీవిస్తున్న వారిని గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పించాలని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి డిమాండ్ చేసింది. బుధవారం బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి మాచినేని కిషన్‌రావు నివాసంలో సమితి రాష్టస్థ్రాయి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఆనాటి ఉద్యమకారులు గోపాలకృష్ణయ్య, నేరేళ్ల అంజయ్య, బాలాచారి, పాశం యాదగిరి, బి. సీతారామ్, నాగం జనార్దన్ రెడ్డితో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. 1969లో ఉద్యమకారులను కాల్చిచంపిన కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో పాటు ఆయన పేరున ఉన్న బంజారాహిల్స్‌లో ఉన్న పార్క్‌కు ఆనాటి ఉద్యమకారులు ప్రతాప్ కిషోర్, రఘువీర్‌రావు, మారేపల్లి జగన్ మోహన్‌లలో ఎవరో ఒకరి పేరు పెట్టాలని తీర్మానించారు. 1969లో 365 మంది పోలీస్ తూటాలకు బలికాగా వారి సమాచారం ఇప్పటికీ అందుబాటులో లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటకు నాంది పలికిన ఉద్యమకారులను గుర్తించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. వారిని గుర్తించాలంటూ తాము జైళ్ల శాఖకు, రాష్ట్ర డీజీపీకి విన్నవిస్తే ఇప్పటివరకు జవాబు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో కేసిఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వం వీరిని గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని వేయాలని కోరారు. గుర్తించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం అసువులు బాసిన ఎందరో మహానుభావుల చరిత్రను ముందు తరాల వారికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. జీవించి ఉన్న ఉద్యమకారులకు నెలకు 5000 చొప్పున గౌరవ భృతిని అందించడంతో పాటు ఉచిత ఆరోగ్య వసతి, బస్‌పాస్ కల్పించాలని కోరారు. అదేవిధంగా ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని తీర్మానాలు చేశారు. అనంతరం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యమకారులందర్ని గుర్తించి తగిన విధంగా సహాయం అందించాలని కోరారు.