ఆంధ్రప్రదేశ్‌

సీడ్‌పై మన ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వ ప్లాట్ల కేటాయింపుపై మరో అవకాశం ఇచ్చింది. భూ సమీకరణ పథకం 9,18ఎ, 9, 18బి కింద ప్లాట్ల కేటాయింపునకు ఆప్షన్ కోరే గడువును ఈ నెల 25 వరకు పెంచుతూ సిఆర్‌డిఎ సమావేశం నిర్ణయం తీసుకుంది. జపాన్‌కు చెందిన పుమిహికో మాకి అండ్ అసోసియేట్స్ ఇచ్చిన డిజైన్‌ను పక్కన పెట్టకుండానే భారతీయ ఆర్కెటెక్ట్‌లతో సీడ్ క్యాపిటల్ భవనాల నమూనాలను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని పరిధిలోని తొలి తరం పౌరుల అభివృద్ధి కోసం సోషల్ ఎంపవర్‌మెంట్ వింగ్ ఒకటి నెలకొల్పాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన వారికి జూన్ 15న నేలపాడు నుంచి ప్లాట్ల కేటాయింపు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. అయితే ప్లాట్ల కేటాయింపులో ఎక్కడా రాజధాని సుందరరూపం చెదిరిపోకుండా, ఒక క్రమపద్ధతిలో ఉండేలా చూడాలని సూచించారు. గ్రీన్ బెల్ట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి గ్రామాలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించిన సిఆర్‌డిఎ అధికారులు ఇందుకు ముందుగా జూన్ 10న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.మొత్తం ప్లాట్ల కేటాయింపు నవంబర్ 23 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్లాట్ల కేటాయింపు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పూర్తి చేసే వరకు సుమారు నెల రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు సైతం నిలిపేయాలని నిర్ణయించారు. వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కొరకు టిటిడి 34 ఎకరాలు కోరినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటివరకు 34,481 ఎకరాల భూసమీకరణ కింద తీసుకున్నట్లు వివరించారు. మరో 5,571 ఎకరాల్లో భూసేకరణ చేపట్టాల్సి వుందన్నారు. భూ సమీకరణను ఈ ఏడాది నవంబర్ 30 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి పి.నారాయణ, సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

చిత్రం... సిఆర్‌డిఎ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు