రాష్ట్రీయం

అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ పదవికి పరాంకుశం వేణుగోపాల్ రాజీనామా చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు ఆదివారం తన కార్యాలయానికి వచ్చి కొన్ని కారణాలను వివరిస్తూ పదవికి రాజీనామా చేయాలని కోరారని వేణుగోపాల్ చెప్పారు. అయితే ఆ కారణాలను మీడియాతో పంచుకోలేనన్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్‌కు పంపానని, అలాగే ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా తెలియచేశానని వేణుగోపాల్ చెప్పారు.
కాగా అడ్వకేట్ జనరల్ రాజీనామా విషయం రాజకీయ, న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అడ్వకేట్ జనరల్ వద్దకు పంపి రాజీనామా చేయాలని కోరడం సరైన విధానం కాదని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి లేదా న్యాయ శాఖ మంత్రి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రమే రాజీనామా చేయాలని అడ్వకేట్ జనరల్స్‌ను అడిగేవారన్నారు. రాష్ట్రంలో న్యాయ శాఖలో పనిచేస్తున్న అధికారుల వ్యవస్ధను ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఇందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.