హైదరాబాద్

18 నుంచి బుక్ ఫెయిర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని నిన్నమొన్నటి వరకు పక్షం రోజుల పాటు జరిగిన కోటి దీపోత్సవంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఎన్టీఆర్ స్టేడియం ఇపుడు సరస్వతి నిలయంగా మారనుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కోసం ముస్తాబవుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పదిరోజుల పాటు పుస్తక ప్రదర్శనను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గత 28 జరిగిన ఈ పుస్తక ప్రదర్శనకు చక్కటి ఆదరణ లభిస్తోంది. ఈ సారి సుమారు 300 స్టాళ్లను ఏర్పాటు చేసే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి తెలంగాణ ప్రాంతీయ రచయితలను ఒక వేదికపైకి తీసుకువచ్చి, వారి పుస్తకాలను వారే స్వల్ప తగ్గింపు ధరలకు విక్రయించుకునేందుకు వీలుగా రైటర్స్ కామన్ హాల్‌ను అందుబాటులోకి తేనున్నారు. అంతేగాక, ఈ సారి తమిళనాడు, కర్ణాటక, మహారాష్టక్రు చెందిన సుప్రసిద్ధ రచయితల పుస్తకాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. దీనికి తోడు భారతదేశంలోని ప్రచురణకర్తలందర్నీ ఈ ప్రదర్శనలో భాగస్వాములను చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ప్రచురణకర్తలు, రచయితలను ఆకట్టుకునేందుకే గాక, పుస్తక ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు గాను ప్రతి రోజు సాయంత్రం పలు ప్రదర్శనలు, విద్యార్థులకు కాంపిటేటీవ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అంతేగాక, ప్రదర్శనను తిలకించేందుకు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేందుకు వీలుగా పలు పుస్తకావిష్కరణ, పుస్తకపఠనంపై ఇష్టాగోష్ఠి, సదస్సులు వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి తోడు రోజురోజుకి పెరిగిపోతున్న ఆధునికత కారణంగా పుస్తకపఠనంపై ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గుతోందని, పుస్తక పఠనానికి పూర్వ వైభవాన్ని సంతరింపజేసేందుకు గాను ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘పుస్తకాలు చదవండి-విజ్ఞానాన్ని పెంపొందించుకోండి’ అన్న నినాదంతో ప్రత్యేకంగా వాక్‌ను కూడా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 300 పై చిలుకు స్టాళ్లు బుక్ అయినట్లు నిర్వాహకుల పక్షాన జూలూరు గౌరిశంకర్ తెలిపారు.
క్రమబద్ధీకరణకు కానరాని స్పందన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 9: గ్రేటర్ హైదరాబాద్‌లోని అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఇటీవలే క్రమబద్ధీకరణ స్కీంలకు ఆశించిన స్థాయిలో స్పందన రావటం లేదు. 2007 సంవత్సరం చివర్లో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రమబద్ధీకరణ స్కీంకు కేవలం నెలరోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చి పడగా, ఇపుడు సర్కారు ఈ స్కీంలను ప్రకటించి 40రోజులు గడుస్తున్నా, కేవలం 8వేల దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో వచ్చాయి. వీటిలో బిపిఎస్‌కు 5వేలు, ఎల్‌ఆర్‌ఎస్‌కు కేవలం 3వేల దరఖాస్తులొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో సుమారు 60వేల వరకు అక్రమ నిర్మాణాలున్నట్లు ఇటీవల చేపట్టిన అధ్యయనంలో గుర్తించామని అధికారులు చెబుతున్నా, దరఖాస్తుదారులు ఎందుకు ముందుకు రావటం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతేగాక, ఇక ఇదే చిట్టచివరి సారి క్రమబద్ధీకరణ అవకాశమంటూ, మున్ముందు అక్రమ నిర్మాణాలు రాకుండా కఠిన చర్యలు చేపడుతున్నా, అక్రమ నిర్మాణాల యజమానుల నుంచి స్పందన రాకపోవటం అధికారులను ఆలోచనలో పడేస్తోంది. ఇందుకు దరఖాస్తుదారులకు తగిన అవగాహన, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు లేకపోవటం ప్రధాన కారణమని చెప్పవచ్చు. 2007లో అప్పటి ప్రభుత్వం ఈ రెండు స్కీంలకు దరఖాస్తులను మాన్యువల్‌గా ఆహ్వానించటంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇపుడు అవినీతికి తావులేకుండా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలన్న సర్కారు నిబంధన ఆదాయానికి అడ్డుగా మారింది. అంతేగాక, ఈ స్కీంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహానగర పాలక సంస్థ ప్రత్యేకంగా బుక్‌లెట్‌ను ప్రచురించినా, ఫలితం దక్కటం లేదు. దీనికి తోడు పలు సర్కిళ్లలో ప్రజల సహాయార్థం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినా, ప్రభుత్వం, అధికారులు ఆశించిన స్థాయిలో ప్రక్రియ ముందుకు సాగటం లేదు. స్కీం అమలు ఇలాకే మందకొడిగా కొనసాగితే సర్కారు ఆశించిన రూ. 800 నుంచి వెయ్యి కోట్ల ఆదాయంలో కనీసం సగం కూడా సమకూరే అవకాశాల్లేవు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలన్న నిబంధన పెట్టిన సర్కారు, దానికి తగిన విధంగా జిహెచ్‌ఎంసి ఐటి విభాగంలో సర్వర్ల సామర్థ్యాన్ని పెంచాలంటూ అధికారులను ఆదేశించకపోవటం కూడా ఈ స్కీంలు తుస్సుమనేందుకు మరో కారణంగా చెప్పవచ్చు. కొన్ని సర్కిళ్లలో ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా కేవలం నాలుగైదు దరఖాస్తులు మాత్రమే అప్‌లోడ్ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకోవటంతో పాటు బోగస్ ఫైల్ నెంబర్లను సైతం దళారులు, సిబ్బంది సృష్టించి అధికారులను అయోమయానికి గురి చేశారు. కానీ ఈసారి అలాంటి లోపాలకు అవకాశం లేకుండా పక్కా ప్రణాళిక, పకడ్బందీ వ్యూహంతో స్కీంలను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి చేసిన ప్రకటన కూడా ఎక్కడా అమలు కావటం లేదు.
అవినీతికి తావులేకుండా క్రమబద్ధీకరణ స్కీంలను అమలు చేస్తున్నామంటూ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్నా, దరఖాస్తుదారులు నిలువు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా సమర్పించాలో తెలీకపోవటం, సర్కిళ్లలోని పౌరసేవ కేంద్రాల్లో గంటలతరబడి వేచి ఉండలేక దరఖాస్తుదారులు
జిహెచ్‌ఎంసి గుర్తింపు పొందిన ఆర్కిటెక్చర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వారు ఒక్కో దరఖాస్తును సమర్పించేందుకు రూ. 3వేల నుంచి రూ. 5వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్ట్ఫికెట్ కోసం కూడా రూ. 3 వేల నుంచి రూ. 4వేల మధ్య వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇక సర్కిల్ కార్యాలయాల సమీపంలోని ఇంటర్నెట్ కేంద్రాలు కూడా దరఖాస్తుదారుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నాయి. అన్ని రకాల డాక్యుమెంట్లు ఇచ్చినా, కేవలం జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాటిని అప్‌లోడ్ చేసేందుకు ఎక్కువ మొత్తంలో వసూలు చేసుకుంటున్నట్లు దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఎలాగో ఉన్నతాధికారులు డాక్యుమెంట్లను అన్ని రకాలుగా పరిశీలించి, నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతే క్లియరెన్స్ ఇచ్చే అవకాశమున్నా, ఈ ఆన్‌లైన్ అవస్థలెందుకు? అంటూ కొందరు దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు.