రాష్ట్రీయం

చిక్కుల్లో మహా ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్టల్ర మధ్య కుదరాల్సిన ఒప్పందాలకు రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డుతోంది. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, తొలుత మహారాష్ట్ర నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంది. గోదావరి జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలకు సైతం రంగం సిద్ధమైంది. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర సానుకూలంగా ఉన్నా, ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఆందోళనలకు దిగడంతో పరిస్థితి జఠిలంగా మారుతోంది. అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలను మహారాష్టక్రు తాకట్టుపెట్టేలా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోందంటూ తెలంగాణ కాంగ్రెస్ సైతం ఆందోళనకు దిగడంతో పరిస్థితి జఠిలమైంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్, సరిగ్గా దీనికి భిన్నమైన వాదనతో మహారాష్ట్ర కాంగ్రెస్ పెద్దఎత్తున ఆందోళనకు దిగింది. దాంతో ఒప్పందాలు కుదరాల్సిన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో సిఎం కెసిఆర్ మహారాష్ట్ర సిఎంతో చర్చించి వచ్చారు. ఆ వెంటనే ఒప్పందాలు జరుగుతాయని ప్రకటించారు. మార్చిలోనే తెలంగాణ, మహారాష్టల్ర మధ్య గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అయితే, మే నెల గడచిపోతున్నా ఇంతవరకూ ఒప్పందాలు కుదరలేదు. కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో రెండు రాష్ట్రాలూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రెండు మూడు నెలల ఆలస్యమైనా ఫరవాలేదుగానీ, ఒప్పందాలు కుదరడం ముఖ్యమని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు.
వాస్తవానికి చరాక -కొరాట బ్యారేజీ నిర్మాణానికి శనివారం మహారాష్ట్ర అటవీ, పర్యావరణ అనుమతులు లభించడంతో మహా ఒప్పందాలకు శుభ సూచకమనే తెలంగాణ భావించింది. మహారాష్ట్ర విపక్షం లేవనెత్తే ప్రతి అంశానికీ సమాధానం చెప్పే విధంగా తెలంగాణ ప్రాజెక్టులపై మహారాష్ట్ర అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది.
తెలంగాణ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజింగ్ (సిడిఓ) నుంచి ఇంజనీర్ల బృందం, నీటిపారుదల అధికారులు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన డిజైన్లు, ఇతర సాంకేతిక వివరాలతో కూడిన పత్రాలను నాసిక్‌లో మహారాష్ట్ర అధికారులకు శనివారం అందించారు. సాంకేతిక అంశాలను మహారాష్ట్ర అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనం అనంతరం మేడిగడ్డ బ్యారేజీపై ఒప్పందాలకు మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం సూత్రప్రాయంగా ఒప్పందాలకు మహారాష్ట్ర అంగీకరించినా, అధ్యయనం తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తారు. రెండు రాష్ట్రాల సిడిఓలు సమావేశమై సందేహాలను నివృత్తి చేసుకుంటారు. రాజకీయంగా ఇబ్బందులు లేకుండా మహారాష్ట్ర ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ పరిణామాల వల్ల ఒప్పందాలు ఒకటి రెండు నెలలు ఆలస్యం కావచ్చుగానీ, ఇబ్బందులు ఉండవని అధికారులు అంటున్నారు. ఇరు రాష్ట్రాల సిడివోలు నివేదికల అధ్యయనం తరువాతే, ఇరు రాష్ట్రాల సిఎంలు సమావేశమై ఒప్పందాలపై ఒక నిర్ణయానికి వస్తారు.
ఇదిలావుంటే, వంద మీటర్ల ఎత్తువరకు బ్యారేజీ నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర ఇంతకుముందే ప్రకటించింది. సాధ్యమైనంత వరకు ముంపు తగ్గిస్తూ ప్రాజెక్టు ఎత్తు ఎక్కువగా ఉండేలా చూడాలని తెలంగాణ కోరుకుంటోంది. 101 లేదా మరో అడుగు ఎత్తులో బ్యారేజీ నిర్మించినా మహారాష్టక్రు ముంపు ఉండదని తెలంగాణ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్‌కు ఇప్పటికే వివరించారు. తెలంగాణ తమ వాదనకు మద్దతుగా లైడార్ సర్వేలు, వాప్కోస్ బృందం నివేదికలను మహారాష్టక్రు అందించింది కూడా.
అయితే, కాంగ్రెస్ రాజకీయ ఆందోళన వల్ల ఒప్పందాలకు సమస్య తలెత్తిందని, అయితే మహారాష్ట్ర సందేహాలన్నీ నివృత్తిచేసి ఒప్పందాలకు మార్గం సుగమం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మేడిగడ్డ వద్ద వంద అడుగులు లేదా 102 అడుగుల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్టల్రోని సిరోంచాలో 25 గ్రామాలు, 25వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది. సిడివోల సమావేశంతో అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు.