రాష్ట్రీయం

కలాం పేరిట మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం పేరిట మోసానికి పాల్పడింది. కలాం టాలెంట్ టెస్ట్ పేరుతో వేలాది మంది విద్యార్థులను మోసం చేసింది. పరీక్ష రద్దు వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. నిర్వాహకుల వైఖరికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ప్రశ్న పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నగరంలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. నగరంలోని సంతోష్‌నగర్‌కు చెందిన ఎపిజె అబ్దుల్ కలాం సంక్షేమ సంఘం అనే సంస్థ దేశవ్యాప్తంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిశ్చయించుకుంది. ఏపిజె అబ్దుల్ కలాం ఆలిండియా బ్రైట్ స్టూడెంట్ పేరిట పురస్కారాలు ఇవ్వనున్నట్టు దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. 4వ, తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు మాత్రమే అర్హులంటూ ఇచ్చిన ప్రకటనలకు విద్యార్థులు ఆకర్షితులయ్యారు. రాష్ట్రానికి చెందిన వేలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. టాలెంట్ టెస్ట్ నిర్వాహకులు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 250లు చొప్పున వసూలు చేశారు. ఆదివారం ఉదయం పరీక్ష జరగాల్సి ఉండగా ముగ్గురు నిర్వాహకులు పరీక్షా కేంద్రం వద్దకు వచ్చి పరీక్ష రద్దయినట్టు ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. పరీక్ష నిర్వహణలో తలెత్తిన గందరగోళంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పరీక్ష కేంద్రం వద్ద ప్రశ్న పత్రాలను సంతోష్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు
టాలెంట్ టెస్ట్ పేరుతో విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేసి పరీక్ష నిర్వహించకుండా మోసగించిన అబ్దుల్ కలాం సంక్షేమ సంఘం సంస్థపై విద్యార్థులు బాలల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిర్వాహకులపై పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.