జాతీయ వార్తలు

బంగ్లాదేశ్‌లో తీరం దాటిన ‘రోను’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, మే 22: ఊహించినట్లుగా బంగ్లాదేశ్ దక్షిణ తీరాన్ని తాకిన పెను తుపాను ‘రోను’ భారీ విధ్వంసాన్ని సృష్టించడమే కాకుండా కనీసం 24 మందిని పొట్టన పెట్టుకుంది. వందమందికి పైగా గాయపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం ఉదయం తుపాను బరిసాల్-చిట్టగాంగ్ మధ్య తీరాన్ని తాకినప్పుడు గంటకు 88 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. ఆదివారం తెల్లవారుజామునుంచి చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతోపాటుగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
చిట్టగాంగ్ రేవు వద్ద తీరాన్ని దాటిన తర్వాత తుపాను క్రమేణా బలహీన పడుతోందని బంగ్లాదేశ్ న్యూస్ తెలియజేసింది. కాగా, తుపాను కారణంగా కనీసం 24 మంది చనిపోగా, ఒక్క చిట్టగాంగ్‌లోనే పదిమంది చనిపోయారు. భోలా, నవఖాలి, కాక్స్‌బజార్ జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున చనిపోయారు. తుపాను కారణంగా చిట్టగాంగ్‌లో దాదాపు 40 వేల దాకా ఇళ్లు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయని, పెనుగాలులకు పలుగ్రామాల్లో వందలాది గుడిసెలు ధ్వంసమైనాయని అధికారులు తెలిపారు. పెనుగాలుల తాకిడికి అనేక చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోను తుపాను కారణంగా చిట్టగాంగ్‌లోని షా అమానత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. మరో 24 గంటల పాటు ఢాకా, ఖుల్నా, బరిసాల్ చిట్టగాంగ్, సిల్హెట్ డివిజన్లలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.