రాష్ట్రీయం

జపాన్ పెట్టుబడుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సంస్థలు ముందుకొచ్చాయి. జపాన్‌కు చెందిన సుమారు 130 మంది పారిశ్రామిక ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విజయవాడలో సమావేశమై అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్ర రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా 33 వేల ఎకరాల భూమిని సేకరించామని చెప్పారు. వినూత్నమైన ఆలోచనలతో ఎపిని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. భారత దేశంలో జపాన్‌కు చెందిన సుమారు 1000 కంపెనీలు ఉన్నాయని, మరో 150 కంపెనీలు రానున్నాయని తెలిపారు. ఇప్పటికే జపాన్‌కు చెందిన ఇసూజ్ కంపెనీని శ్రీసిటీలో ఏర్పాటు చేశామని చెప్పారు. ఎపి రాజధాని అమరావతికి ప్లాన్‌ను జపాన్ నుంచి తీసుకున్నామని, అందువల్ల దాని అభివృద్ధి బాధ్యత కూడా జపాన్ పైనే ఉందని చంద్రబాబు చెప్పారు. అమరావతిని రెండో టోక్యోగా మార్చాలని ఆ దేశ పారిశ్రామిత వేత్తలను కోరారు. జపాన్‌లో వనరులు, సాంకేతిక పరిజ్ఞానం విరివిగా ఉన్నాయని, ఇక్కడ మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం ఉందని, వీటిని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత ఇరుపక్షాలపై ఉందని చంద్రబాబు చెప్పారు. వీలైనంత త్వరలో విజయవాడ నుంచి టోక్యోకు విమాన సర్వీసు నడపాలని కోరారు. ఈసందర్భంగా జపాన్ మంత్రి తకాడి మాట్లాడుతూ అమరావతిలో వౌలిక సదుపాయాలు కల్పించడానికి జపాన్ సంస్థలు ముందుకొస్తాయని ప్రకటించారు. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఈసందర్భంగా జపాన్ సంస్థలు ఇక్కడ పెట్టనున్న పెట్టుబడులకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాయి. అమరావతిని స్మార్ట్స్ క్యాపిటల్‌గా మార్చడానికి మైక్రో గ్రిడ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఫ్యూజీ కంపెనీ ముందుకొచ్చింది. స్మార్ట్ గ్రిడ్ ఫీడర్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ గ్రిడ్ మీటర్స్ మేనేజ్‌మెంట్, రెన్యువబుల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అంశాలపై పనిచేసేందుకు ఫ్యూజీ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎపి ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న ఫైబర్ కేబుల్ వ్యవస్థలో భాగంగా స్మార్ట్ మీటర్స్ అభివృద్ధి చేయడానికి సహకరించాలని ఫ్యూజీ సంస్థను కోరారు. రియల్ టైమ్ స్మార్ట్ మీటర్ రీడింగ్ డివైస్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌ను ఫ్యూజీ కంపెనీకి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్‌లోగా రియల్ టైమ్ రీడింగ్ సెంటర్‌ను పూర్తిచేయాలని చంద్రబాబు ఫ్యూజీ కంపెనీకి సూచించారు. అలాగే వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో పెట్టుబడులు పెట్టడానికి జెఎఫ్‌ఈ కంపెనీ ముందుకొచ్చింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్ట్‌లకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని ఈ సంస్థను సిఎం కోరారు. రాష్ట్రంలో చేపట్టిన 10 వేస్ట్ టు ఎనర్జీ క్లస్టర్లు, వాటికి జెఎఫ్‌ఈ అందించే సహకారంతో రానున్న కాలంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎపిని నెంబర్ వన్‌గా మార్చగలమన్న విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.
నిప్పన్ కంపెనీకి బాధ్యతల అప్పగింత
ఇదిలావుండగా, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించడానికి నిప్పన్ సిగ్నల్ కంపెనీ ముందుకొచ్చింది. తొలుత విజయవాడ నగరంలో అమరావతి ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాలని చంద్రబాబు సూచించారు. అలాగే బయోమెట్రిక్ సొల్యూషన్స్‌పై ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎన్‌ఈసి కంపెనీ ఆసక్తి కనబరిచింది. ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీలో వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న ఎన్‌ఈసి సెకనుకు మూడు లక్షల ముఖాలను క్యాప్చర్ చేయగల సాంకేతిక గురించి సిఎంకు వివరించింది. ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ, క్రౌడ్ బిహేవియర్ మానటరింగ్ టెక్నాలజీని కృష్ణా పుష్కరాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని ఎన్‌ఈసి సంస్థను చంద్రబాబు కోరారు. అలాగే సిటీ సర్వేలెన్స్ సిస్టమ్‌పై ప్రభుత్వానికి సహకరిస్తామని ఎన్‌ఈసి సంస్థ తెలియచేసింది.
ఈ-గవర్నమెంట్, ఐసిటీ ప్లాట్‌ఫాంపై కొత్త రాష్ట్రంలో పనిచేసేందుకు ఇంటర్నెట్ ఇనిషియేటివ్ జపాన్ ఐఐజే సంస్థ ముందుకొచ్చింది. ఏపీలో ల్యాండ్ టైటిల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, మాడ్యులర్ డేటా సెంటర్లను అభివృద్ధి చేయడానికి జపాన్‌కు చెందిన ఐసిటీ సంస్థ సంసిద్ధత తెలియజేసింది. క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటులో ఏపీతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని ఐసిటీని చంద్రబాబు కోరారు. డిజాస్టర్ ప్రివెన్షన్ సొల్యూషన్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ అనే అంశంపై తోషిబా కంపెనీ అభివృద్ధి చేసిన టెక్నాలజీని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. తోషిబా కంపెనీ ఇచ్చిన రెడీమేడ్ సొల్యూషన్స్‌పై సిఎం ఆసక్తి కనబరిచారు. తోషిబా అభివృద్ధి చేసిన అత్యాధునిక రాడార్ వ్యవస్థ ద్వారా ఫోర్‌కాస్టింగ్‌తో పాటు ఫ్లడ్ మేనేజ్‌మెంట్ కూడా చేపట్టాలని సిఎం సూచించారు. తుపానులు, వరదలు వచ్చే రెండు, మూడు మాసాల్లో ఈ టెక్నాలజీని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఏపీలో ఏర్పాటు చేయడానికి సిఎం అంగీకరించారు. స్మార్ట్ సిటీ నిర్మాణం, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు హిటాచీ కంపెనీ ముందుకొచ్చింది. జపాన్‌కు చెందిన కంపెనీలు ఏ పైలెట్ ప్రాజెక్ట్‌నైనా ఏపీలోనే ముందుగా ఏర్పాటు చేసి, ఆ తరువాత దేశమంతా విస్తరించాలని జపాన్ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. అమరావతిలో నిర్మించనున్న నవ నగరాల్లో ఒక నగర నిర్మాణ బాధ్యతను జపాన్‌కు అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జపాన్‌కు చెందిన మెటీ, జెట్రో, జైకా, నెడో, జెబిసి, జెబిసి-మెటీ, తదితర సంస్థలు పాల్గొన్నాయి.

చిత్రం జపాన్ మంత్రి తకాడికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతిస్తున్న సీఎం చంద్రబాబు