రాష్ట్రీయం

టి.మెడికల్ ఇంకొంత జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి త్వరలో ఎమ్సెట్ నిర్వహించనున్నట్టు గతంలో ప్రకటించినా, ఇంకా అందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ వ్యవహారం మరింత జాప్యమవుతోంది. కేంద్రం జారీ చేయాల్సిన ఆర్డినెన్స్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది. శుక్రవారం నిర్వహించిన కేంద్ర కేబినెట్ నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నా రాష్టప్రతి దానిపై న్యాయసలహా కోరారనే వార్తలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై తొందరపాటు పనికి రాదని యోచిస్తోంది. షెడ్యూలు ప్రకటించి అభ్యర్ధులకు దరఖాస్తు గడువు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం హాల్‌టిక్కెట్లు జారీ చేయడం, పరీక్షకు ప్రిపరేషన్‌కు గడువు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే షెడ్యూలు ప్రకటించించి ఉంటే ఎమ్సెట్ మెడికల్ స్ట్రీం పరీక్షకు అంతా సన్నద్ధమయ్యేవారు. మొత్తం ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 1 నుండి వైద్య విద్యా కోర్సులకు క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా అది నెరవేరేలా లేదు. గతంలో సుప్రీంకోర్టు ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు 1నాటికి వైద్య విద్యా కోర్సులకు క్లాసులు ప్రారంభించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 1న తరగతులు ప్రారంభించాలంటే జూన్ చివరి వారంలోనైనా ఫలితాలను ఇవ్వాలి. పరీక్ష జరిగిన తర్వాత కీ విడుదల, అభ్యంతరాల స్వీకారం, తుది కీ రూపకల్పన వంటి ప్రక్రియకు కనీసం 10 రోజులు గడువు కావాలి. జూలై మొదటి వారంలో పరీక్ష నిర్వహించాలంటే జూన్‌లో దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రాష్డ్రపతి సంతకం అయిన తర్వాత కేంద్రం అధికారికంగా నీట్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌ను జారీ చేస్తే తప్ప ఈ వ్యవహారంలో ముందుకు సాగరాదని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రలో అన్‌రిజర్వుడ్ కోటా (15 శాతం) సీట్ల భర్తీకి తెలంగాణ విద్యార్ధులు, తెలంగాణలో అన్ రిజర్వుడ్ కోటాకు ఆంధ్ర సహా పొరుగు రాష్ట్రాల విద్యార్ధులు పోటీ పడే వీలుంది కనుక ఒకే సమయంలో ఇందుకు సంబంధించిన కౌనె్సలింగ్ జరగాల్సి ఉంది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల హెచ్చరికలతో తొందరపడి పరీక్షను వాయిదా వేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఇపుడు భావిస్తోంది. రెండు పరీక్షలు వల్ల విద్యార్ధులకు పరీక్ష ఫీజుతో పాటు ఒత్తిడి కూడా ఎక్కువైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక పూట నీట్ అని మరో పూట ఎమ్సెట్ అని అధికారులు చెప్పడంతో అయోమయానికి గురవ్వడం విద్యార్ధుల వంతైంది.