రాష్ట్రీయం

ప్రచండంగా రోహిణి కార్తె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24 : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేటినుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ‘రోహిణీ కార్తె’ బుధవారం ప్రారంభమై జూన్ 8 వరకు ఉంటుంది. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత సాధారణంగా రోహిణిలోనే నమోదవుతోంది. గత పది పదిహేను రోజుల నుంచి తుపానుతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి, గత రెండు రోజుల నుండి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం ప్రారంభమయ్యే రోహిణి కార్తెలో తీవ్రమైన ఎండలు ఉంటాయని శాస్ర్తియంగానూ వెల్లడైంది. వచ్చే నాలుగైదు రోజుల్లో గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) హైదరాబాద్ డైరెక్టర్ (ఇంచార్జి) డాక్టర్ కె నాగరత్న తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదవుతాయని వివరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ఉంటాయని, వేడిగాలులు వీస్తాయని ఆమె పేరుతో ఒక బులెటిన్ విడుదలైంది. ఇలా ఉండగా 2016 వేసవిలో ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 500 మందికిపైగా వేడిగాడ్పుల వల్ల మరణించారని అధికారిక లెక్కలే తెలియచేస్తున్నాయి. మంగళవారం అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా నమోదైంది. బుధవారం నుంచి ఈ తీవ్రత మరింత పెరుగుతుందని తెలియడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తీవ్రమైన ఎండల కారణంగా కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని ఇప్పటికే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేశాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 10 తర్వాతనే రాయలసీమను తాకుతాయని, ఆ తర్వాత తెలంగాణకు విస్తరిస్తాయని ఇప్పటికే ఐఎండి తెలిపింది. అయితే ఒక్కో పర్యాయం రుతుపవనాలకంటే ముందే కొన్నిచోట్ల వర్షాలు కురుస్తుంటాయి. ముందస్తు వర్షాలు వస్తాయో లేదో జూన్ ప్రారంభమైతేగానీ తేలదు.