తెలంగాణ

ఆదర్శంగా పాలమూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: దేశంలోనే ఆదర్శంగా పాలమూరు ప్రాజెక్టును నిర్మించాలని, నిర్దేశించుకున్న సమయంకన్నా ముందే ప్రాజెక్టు పూర్తిచేయాలని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఐడిసి కార్యాలయంలో పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి మంగళవారం సమీక్ష జరిపారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ప్రారంభించిన తొలి ప్రాజెక్టును 30 నెలలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా, గడువుకు ముందే పూర్తి చేసి వలసల జిల్లా మహబూబ్‌నగర్ అరవై ఏళ్ల గోస తీరుద్దామన్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందాలన్నీ నెలాఖరులోగా పూర్తి కావాలన్నారు. పిఆర్‌యల్‌ఐఎస్‌కు చెందిన కట్టలు, కాలువలు నిర్మాణం ప్రాధాన్యతాపరంగా భూమి సేకరించాలని మంత్రి ఆదేశించారు. పనులు వేగవంతం చేసి జూలై మొదటివారానికి బిల్లులు అందించాలని కాంట్రాక్టర్లకు చెప్పారు. ప్యాకేజీల వారీగా పిఆర్‌ఎల్‌ఐఎస్ పనులను సమీక్షించారు. సమావేశంలో కాంట్రాక్టర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఇంజనీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరు ఎత్తి పోతల దేశ చరిత్రలో నిలిచిపోతుందని, సకాలంలో పూర్తి చేయాలన్నారు. వచ్చే ఐదేళ్లలో పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. సమావేశంలో మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడి, ఇరిగేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ ఎస్‌కె జోషి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి, ఇరిగేషన్ ఓఎస్‌డి శ్రీ్ధర్‌రావుదేశ్ పాండే, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
542 కోట్ల ఖర్చు
రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తి పోతల పథకాల ప్రగతిని హరీశ్‌రావు సమీక్షించారు. 73 ఎత్తి పోతల పథకాల ద్వారా 20 లక్షల 456 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 542 కోట్ల 37లక్షలు వ్యయం చేసినట్టు, మిగతా పనులకు 162 కోట్ల 12లక్షల రూపాయలు ఖర్చవుతాయన్నారు. కొత్తగా చేపట్టే 17 ఎత్తి పోతల పథకాల ద్వారా 8360 ఎకరాలకు ఆయకట్టు అందించాల్సి ఉందని చెప్పారు. ఈ పథకాలన్నీ సత్వరం పూర్తి అయ్యేందుకు కృషి చేయాలని హరీశ్‌రావు సూచించారు. ఆయా లిఫ్ట్‌ల పరిధిలోని ఎమ్మెల్యేలు ఈ పనులు సత్వరం పూర్తి కావడానికి తగిన సహకారం అందించాలని కోరారు.

చిత్రం... పాలమూరు ప్రాజెక్టుపై సమీక్ష జరుపుతున్న మంత్రి హరీశ్‌రావు