తెలంగాణ

ప్రస్తుతానికి బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: రాష్టవ్య్రాప్తంగా సుమారు నాలుగు వేల వరకు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి మళ్లీ బ్రేక్‌పడింది. జూన్ 2న రాష్ట్రావతరణ వేడుకలు ముగిసిన తర్వాతే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని తాజాగా సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు పార్టీవర్గాల సమాచారం. ఖమ్మంలో గత నెల 27న జరిగిన తెరాస ప్లీనరీలో మే నెలాఖరులోగా రాష్టవ్య్రాప్తంగా ఖాళీగావున్న నామినేటెడ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్నట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. అయితే ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలు అడ్డురావడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదాపడింది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని మొదట సిఎం భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో బ్రేక్ పడిందని అంటున్నారు. రాష్ట్రావతరణ వేడుకలు ప్రతిష్టాకరంగా నిర్వహించాలని సిఎం భావిస్తున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్లతో సిఎం ప్రత్యేకంగా సమావేశంకావడం, అధికార యంత్రాంగమంతా వేడుకల నిర్వహణలో తలమునకలు కావడంతో నామినేటెడ్ పోస్టుల నియామకాలకు తాత్కాలికంగా మళ్లీ వాయిదా పడినట్టు తెరాస వర్గాల సమాచారం. ఇలావుండగా మరోవైపు రాజ్యసభకు రాష్ట్రంనుంచి ఖాళీ అయిన రెండు స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభంకావడం కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడటానికి మరో కారణంగా వినిపిస్తుంది. రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్న నేతలలో కొందరికి రాష్టస్థ్రాయి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఇవ్వాలని సిఎం భావిస్తున్నారని, మొదట ఈ పోస్టులకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని కూడా తెరాస వర్గాల సమాచారం.