తెలంగాణ

నోరు మెదపని కెసిఆర్.. ఆశావహుల అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ల పర్వం ప్రారంభం అయిన తరువాత కూడా ముఖ్యమంత్రి మనసులో ఏముందో తెలియక నాయకులు ఆయోమయంలో ఉన్నారు. తెలంగాణ నుంచి రెండు స్థానాలు ఉండగా, రెండింటిలోనూ టిఆర్‌ఎస్ విజయం సాధించడానికి కావలసిన బలం ఉంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటివరకు తన మనసులో ఏముందో చెప్పడం లేదు. రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్న నాయకులు మాత్రం ముఖ్యమంత్రిని కలిసి వెళుతున్నారు. పారిశ్రామిక వేత్త సిఎల్ రాజం మంగళవారం ముఖ్యమంత్రిని కలిశారు. తెలంగాణ ఆవిర్భావం జరిగిన తరువాత బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు రాజంకు రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ తరువాత రాజం బిజెపిలో చేరారు. తిరిగి ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా, రెండు స్థానాల్లో టిఆర్‌ఎస్ గెలిచే అవకాశం ఉన్నందున ఒకటి బిసిలకు కేటాయించాలని బిసి నాయకులు కొందరు కోరుతున్నారు. బిసి అభ్యర్థి ఒకరికి అవకాశం కల్పించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కోరారు. డి శ్రీనివాస్ బిసి కోటాలో అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.
అరవింద్‌కు ఆంధ్రలో....!
మరోవైపు తెలంగాణ టిడిపి నాయకులు తెలంగాణ కోటా కింద తమకు ఆంధ్రలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తెలంగాణ జిల్లాల్లో టిడిపి సమావేశం ఎక్కడ జరిగినా ఆంధ్రలో పదవులు ఇవ్వాలని తీర్మానం చేస్తున్నారు. టిడిపి సీనియర్ నాయకుడు అరవింద్‌కుమార్ గౌడ్‌ను ఆంధ్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని హైదరాబాద్ మినీ మహానాడులో తీర్మానం చేశారు. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న పార్టీ బతికి బట్టకట్టాలంటే కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, తెలంగాణ నాయకులకు ఇవ్వాలని తెలంగాణ టిడిపి నాయకులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే ఆంధ్రలో రెండు నామినేటెడ్ పదవులు తెలంగాణ వారికి ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన రావులపాటి సీతారామారావును ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. వరంగల్ జిల్లాకు చెందిన పిఎన్‌వి ప్రసాద్‌ను గిడ్డంగుల నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌రావును ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మీడియా వ్యవహారాల ఒఎస్‌డిగా నియమించారు. గతంలో ఎమ్మెల్యే సాయన్నకు టిటిడిపి బోర్డు సభ్యత్వం కల్పించారు. ఆయన రాజీనామాతో ఈ స్థానం కోసం చాలామంది తెలంగాణ నాయకులు ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన శోభారాణి టిటిడి బోర్డు సభ్యత్వం కల్పించాలని చంద్రబాబును కోరారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డికి ఆ పదవి ఇవ్వడానికి చంద్రబాబు ఆసక్తి చూపించారు. తెలంగాణలో పలువురు టిడిపి నాయకులు ఆంధ్రలో పదవుల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన పదవుల కేటాయింపులో తెలంగాణ టిడిపి నాయకులకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు.

ఏపి ఇంజనీరింగ్ అడ్మిషన్లకు
27న నోటిఫికేషన్
జూన్ 6 నుండి
సర్ట్ఫికెట్ల వెరిఫికేషన్
15 నుండి ఆప్షన్లు, చివరి
వారంలో సీట్ల కేటాయింపు
జూన్ 27 నుండి క్లాసులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు షెడ్యూలు సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీన అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 27న నోటిఫికేషన్ వస్తుందని, హెల్ప్ లైన్ సెంటర్లలో జూన్ 6 నుండి సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుందని, అభ్యర్ధులు తమ ఆప్షన్లను ఆన్‌లైన్‌లోనే ఈ నెల 15వ తేదీ నుండి ఇవ్వవచ్చని, చివరి వారంలో మరో అవకాశం కల్పించి సీట్లను కేటాయిస్తామని సాంకేతిక విద్యాశాఖ అధికారులు చెప్పారు. వచ్చే నెల 27 నుండి క్లాసులు ప్రారంభిస్తామని అన్నారు.