తెలంగాణ

తెలంగాణలో సీరియస్‌గా ముందుకెళదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: తెలంగాణలో పార్టీ బలోపేతానికి చాలా సీరియస్‌గా ముందుకెళ్లాలని బిజెపి రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నెల 30న తెలంగాణ రాష్ట్రానికి రానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని నిర్ణయించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు.
సుమారు 60 మంది నాయకులు రోజంతా మంతనాలు జరిపారు. ఇప్పటినుంచే పార్టీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్టీ పటిష్ఠతకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ అగ్ర నాయకుల, కేంద్ర మంత్రుల పర్యటనలతో తెలంగాణ జిల్లాల్లో హోరెత్తించాలని, తెలంగాణ రాష్ట్ర సమితికి బిజెపియే ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావించారు. పొత్తుల గురించి ఆరాటపడకుండా, స్వతహాగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే విస్తృతంగా జిల్లా పర్యటనలు చేపట్టాలని, తరచూ పార్టీ జాతీయ నాయకులను ఆహ్వానిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని భావించారు. వచ్చే మూడేళ్ళ వరకు పార్టీ సమావేశాలకు కేంద్ర మంత్రులనూ ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇలాఉండగా కేంద్రంపై లేనిపోని విమర్శలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురు దాడి చేయాలని భావించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ టిఆర్‌ఎస్ నాయకులు, రాష్ట్ర మంత్రులు చేస్తున్న విమర్శలపై ఎదురు దాడి చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం కాదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, అనవసరమైన అబాండాలను తిప్పికొట్టాలని బిజెపి నేతలు భావించారు.

హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ