తెలంగాణ

సయోధ్యకు వస్తేనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదాస్పదంగా మారిన రాజోళిబండ ప్రాజెక్టు ఎత్తు పెంచే అంశం కొత్త మలుపుతిరిగింది. ఉభయ రాష్ట్రాలు సయోధ్య కుదుర్చుకుని ఒక రాజీ ఫార్ములాను సూచించాలని.. అప్పుడే ఆర్డీఎస్ ఎత్తు పెంపుపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని ఏపీ ఇంజనీర్ల బృందానికి కర్నాటక తేల్చి చెప్పినట్లు సమాచారం. ఏపి జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, కర్నూలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో నిపుణులు మంగళవారం బెంగళూరుకు వెళ్లి కర్నాటక ప్రభుత్వాధికారులను కలిసి ఈ ప్రాజెక్టు ఎత్తుపెంచరాదని కోరారు. ఈ ప్రాజెక్టు ఎత్తును పెంచడం వల్ల కెసి కెనాల్‌కు నీళ్లు రావని వారు వివరించారు. ఈ ప్రాజెక్టు తమ భూభాగంలో ఉందని, ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 58 కోట్లను డిపాజిట్ చేసినట్లు కర్నాటక జలవనరుల శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లకు చెప్పారు. ఈ అంశంపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంగా చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని, తాము చర్చల విషయంలో తల దూర్చమని కర్నాటక జలవనరుల శాఖ తేల్చి చెప్పినట్లు సమాచారం. రెండు రాష్ట్రాలు వివాదస్పదమైన ప్రకటనలతో ప్రజలను రెచ్చగొట్టవద్దని, సంయమనంతో ఉండాలని, ప్రాజెక్టు స్థలం వద్ద పోలీసు భద్రత పెంచామని కర్నాటక ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రప్రభుత్వాలు సయోధ్యకు వచ్చి ఒక రాజీ ఫార్ములాను ప్రతిపాదించినప్పుడే ప్రాజెక్టు ఎత్తు పెంచడంపై ఒక నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని కర్నాటక ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిసింది. తుంగభద్ర బోర్డు సమావేశం త్వరలో జరుగుతుందని, ఆ లోగా రెండు రాష్ట్రాలు చర్చించుకుని ఏకాభిప్రాయంతో రావాలని కర్నాటక కోరినట్లు సమాచారం.
రెండు మీటర్లకే
నీటి ఊట!
ఇంకుడు గుంత తవ్వకంలో అద్భుతం
ఎల్లారెడ్డిపేట, మే 24: తీవ్ర కరవు, వర్షాభావ పరిస్థితులతో ప్రజలు తాగునీటి కోసం నానా పాట్లు పడుతున్నారు. చుక్కనీటికి భగీరథ ప్రయత్నాలు సాగిస్తున్నారు. వెయ్య ఫీట్లకు పైగా బోరు వేసినా చుక్క నీరు పడని దుర్భిక్షం. కానీ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలోని రైతు మార్పు నర్సింహారెడ్డి ఇంటి సమీపంలో కేవలం రెండు మీటర్ల లోతులోనే నీటి ఊట దర్శనమిచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింట ఇంకుడుగుంత కార్యక్రమంలో భాగంగా అధికారులు నర్సింహారెడ్డి ఇంటి సమీపంలో రెండు మీటర్ల గుంత నిర్మాణం చేపట్టారు. కేవలం రెండు మీటర్ల లోతులోనే నీటి ఊట దర్శనమిచ్చింది. గుంతలో నీరు భారీగా నిండుతోంది. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు. ఈజిఎస్ ఎపివో నర్సయ్య ఇంకుడు గుంతను పరిశీలించారు. ఇంతటి కరవు పరిస్థితుల్లోనూ కేవలం రెండు మీటర్ల లోతులోనే నీరు రావడంతో బండలింగంపల్లిగ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.