తెలంగాణ

సిద్దాపూర్‌లో చిగురిస్తున్న ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, మే 24: సినీ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ దత్తత గ్రామంలో పర్యటించడంతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించడంతో మహబూబ్‌నగర్ జిల్లా సిద్దాపూర్ గ్రామ ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దత్తత గ్రామాభివృద్ధి కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుండడంతో పాటు జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించడంతో గ్రామ ప్రజల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న కొన్ని నెలల తరువాత ప్రిన్స్ మహేష్‌బాబు భార్య నమ్రత గ్రామంలో పర్యటించడమే కాకుండా మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం..మరోసారి ఉన్నతస్థాయి అధికారులతో గ్రామాభివృద్ధిపై చర్చించడం వంటి సంఘటనల నేపథ్యంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో గత నెల 29వ తేదీన సినీ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు భార్య నమ్రత పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యలపై సర్పంచ్ నర్సమ్మ మహేష్‌బాబు భార్య నమ్రతకు ప్రత్యేక నివేదిక సైతం అందజేశారు. గ్రామంలో మంచినీటి ఎద్దడి, వ్యక్తిగత మరుగుదొడ్ల సమస్య, పాఠశాలలో సరైన గదులు లేకపోవడం, ప్రజలు అనారోగ్యాలకు గురికావడం, పశువైద్యశాల లేక మూగజీవాలు మృత్యువాత పడటం వంటి ప్రధాన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని నమత్రకు సర్పంచ్ నర్సమ్మ అందజేసి క్లుప్తంగా వివరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు..పరిష్కార మార్గాలపై మంత్రి జూపల్లి, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవితో ఈనెల 23వ తేదీన రాష్ట్ర సచివాలయంలో విస్తృతంగా చర్చించారు. దత్తత తీసుకున్న సిద్దాపూర్ గ్రామ అభివృద్ధిపై మహేష్‌బాబు భార్య నమ్రత వేగం పెంచడంతో ప్రజల్లో నూతనోత్సాహం నెలకొందని చెప్పవచ్చు. గ్రామంలో నెలకొన్న సమస్యలు మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం..వారు సానుకులంగా స్పందించడంతో అభివృద్ధికి మరింత సులభతరమైందని ప్రజలు భావిస్తున్నారు.