తెలంగాణ

నిఘా నీడలో ‘ఆర్డీఎస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 24: రాజోళిబండ మళ్లింపు పథకం దగ్గర కర్ణాటక పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య వివాదాల సుడిగుండంగా మారిన ఆర్డీఎస్ వ్యవహారం ప్రతియేటా చిలికిచిలికి గాలివానలా మారి వివాదాలకు నిలయంగా మారుతోంది. ఇదే అదనుగా భావించిన కర్ణాటక సైతం ఆధునికీకరణ పనుల విషయంలో మరింత జాప్యం చేస్తోంది. గత వారం రోజుల నుండి రాజోళిబండ రగులుతున్న నేపథ్యంలో మరోసారి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆర్డీఎస్ అనకట్టవైపు తన అనుచరులతో రైతులతో కలిసి గత రెండు రోజుల క్రితం రావడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన కర్ణాటక ప్రభుత్వం ఆర్డీఎస్ దగ్గర వందలాది మంది పోలీసులను మోహరింపజేసింది. ప్రస్తుతం పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. అవసరమైతే పారామిలటరీ దళాలను దింపేందుకు సైతం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుండి ఆర్డీఎస్‌కు వచ్చే రహదారులను దాదాపు కిలోమీటర్ల మేర కర్ణాటక పోలీసుల గుప్పిట్లోకి తీసుకున్నారు. అటువైపు నుండి ప్రాజెక్టుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అటువైపు నాయకులు రైతులతో కలిసి ఏ క్షణమైనా రావచ్చనే అనుమానాలతో కర్ణాటక ప్రభుత్వం పోలీసు బందోబస్తును మరింత పటిష్టం చేసింది. గతంలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని అలాంటి సంఘటనలు పురావృతం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు కర్ణాటక ప్రత్యేక చొరవ తీసుకుంటోంది.
అయితే ఇటీవల ఇరురాష్ట్రాల నీటిపారుదల శాఖమంత్రులు కర్ణాటక ప్రభుత్వానికి లేఖలు రాయడం, ఒకరేమో ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని, మరొకరు పనులు జరపొద్దంటూ లేఖలు రాశారు. దీంతో ఇరు ప్రాంతాల మధ్య మరింత వివాదానికి ఆజ్యం పోసింది. ఇదిలా ఉండగా వైకాపా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆర్డీఎస్ వరకు రైతులతో కలిసి రావడం, దాంతో వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం ఆర్డీఎస్‌లో తెలంగాణకు సంబంధించిన ప్యాకేజీ-1 పనులు నిలిచిపోవడంతో ఈ ప్రాంత నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
ఆర్డీఎస్ ఆయకట్టు చైర్మన్ సీతారామరెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో తిరిగి ఆర్డీఎస్ ప్రాజెక్టులో పూడికతీత పనులు, ఆనకట్ట పెంపు పనులు ప్రారంభం కావాలని, లేకుంటే తామే స్వయంగా ఆర్డీఎస్‌కు వెళ్లి పూడికతీత పనులను రైతులతో కలిసి చేపడతామని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కావాలనే ఆర్డీఎస్ పనులను జరగకుండా కర్ణాటక ప్రభుత్వానికి లేఖలు రాశారని, అదేవిధంగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలపాగిరెడ్డి రైతులను రెచ్చగొడుతున్నారని