తెలంగాణ

గత పాలకుల బాటలోనే కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 24: గత ప్రభుత్వ విధానాలనే తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలో జరిగిన తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతోనే ఏర్పడిందని, ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. ఆదివాసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మూడవ దశ గ్రీన్‌హంట్ మారణకాండను వెంటనే నిలిపివేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులే ఉంటారని అనుకున్నామని, అయితే స్వరాష్ట్రం వచ్చిన తరువాత కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ గత పాలకుల విధానాలనే అనుసరించడం సరైందికాదన్నారు. ఆదివాసీల భూమి ఆదివాసీలకే చెందాలని వారు చేస్తున్న ఉద్యమం న్యాయబద్ధమైందని అన్నారు. ఆదివాసీలను మాట్లాడనివ్వకుండా నోరునొక్కడం ఏ ప్రభుత్వాలకు కూడా చెల్లదన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దళితులపై వివక్ష కొనసాగుతోందని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల కోసం ఏర్పాటు చేసుకున్న ఇలాంటి సభలపై పోలీసుల నిర్బంధం ఎంతమేరకు సమంజసమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చని, సభలు, సమావేశాల ద్వారా వారి సమస్యలను చెప్పుకునే అధికారం ఉందన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలే కాదన్నారు. ఇలాంటి సభలో వరవరరావు లాంటి వ్యక్తులను మాట్లాడనివ్వకుండా చేయడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన చెందారు. చత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలు భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తున్నారని, వారి సమస్యలు ప్రభుత్వాలు పరిష్కరించాలని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రులు ఎన్‌టిఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి వారే నక్సలైట్లు నిజమైన దేశ భక్తులని, నక్సల్స్‌తో ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటించడమే కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం మావోలతో చర్చలు జరుపుతామని చెప్పడం పట్ల సమాజంలో వారికి ఉన్న గౌరవం ఎలాంటిదో తెలుస్తుందన్నారు. ఈ సభకు మావోయిస్టులు వస్తారనుకొని పోలీసులు ఎక్కడా లేని బందోబస్తు ఏర్పాటు చేశారని, ఇలాంటి సభలకు వారు వచ్చేవారైతే వారు అడవుల్లో ఎందుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఈసభలో కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. సభకు హాజరైన వారు అమరవీరులకు జోహార్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అడుగడుగునా
అడ్డంకులు
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బహిరంగ సభకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. తెలంగాణ ఏర్పడిన రెండేళ్లలో మొట్టమొదటి సారిగా పోలీసులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సభ చుట్టూ పోలీసులు నిఘా పెట్టారు. సభకు వెళ్లే ప్రతి ఒక్కరిని అణువణువు తనిఖీ చేశారు. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరిని కెమెరాలో బంధించి వీడియో చిత్రీకరించారు. నిఘా కెమెరాల మధ్య భారీ పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. బహిరంగసభకు మావోయిస్టులు హాజరవుతారనే అనుమానంతో పోలీసులు నిఘాను మరింత పెంచారు. ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించ డంతో హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. విప్లవ కవి వరవరరావు ప్రసంగించేందుకు అనుమతి నిరాకరించింది. హరగోపాల్‌తో పాటు మరో ఐదుగురికి మాత్రమే ఈ సభలో ప్రసంగించే అవకాశం కోర్టు కల్పించింది. రాత్రి 7 గంటల లోపు సభా ప్రాంగణాన్ని వదిలివెళ్లాలని కోర్టు ఆదేశించింది.