మాల్యా చిరునామా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: వచ్చే నెల 6వ తేదీలోగా విజయ్‌మాల్యా తాజా చిరునామాను పేర్కొంటూ వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని జిఎంఆర్ సంస్ధను నాంపల్లి మూడవ స్పెషల్ మెజిస్ట్రేట్ కోరారు. ఈ నివేదిక ప్రాతిపదికగా తీసుకుని మరోసారి విజయ్‌మాల్యాకు నాన్‌బెయిలబుల్ వారెంటును జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. జిఎంఆర్ సంస్థకు ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో ఆ సంస్థ విజయ్‌మాల్యాపై మెజిస్ట్రేట్ కోర్టుకు ఫిర్యాదు చేయగా, కోర్టు విచారణ చేపట్టిన సంగతి విదితమే. ఈ కేసును స్పెషల్ మెజిస్ట్రేట్ ఎం కృష్ణారావు విచారించారు. ఈ కేసులో నిందితుడి చిరునామా ఇవ్వాలని మహారాష్ట్ర పోలీసులు కోర్టు ద్వారా జిఎంఆర్ సంస్థను కోరారు. గతంలో కోర్టు సమన్లు జారీ చేస్తే ముంబైలోని మాల్యా ఇంటికి మహారాష్ట్ర పోలీసులు వెళ్లారు. అక్కడ మాల్యా లేకపోవడంతో సమన్లను కోర్టుకు తిరిగి ఇచ్చారు. ఈ కేసు విచారణ పూర్తయింది. నిందితుడు సమాధానం చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున కోర్టు విజయ్ మాల్యాను హాజరుపరచాలని ఇప్పటికి రెండు సార్లు సమన్లు జారీ చేసింది.