ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి బిజెపి ‘వికాస్‌పర్వ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: రెండేళ్ల ఎన్డీఏ పాలన పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు కల్పించిన వౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్రంలోని 7 వివిధ నగరాల్లో ‘వికాస్‌పర్వ్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీల సమావేశం బుధవారం జరిగింది. బిజెపి అధికారం చేపట్టి రెండేళ్లయన సందర్భంగా విజయాలు, సంక్షేమ పథకాలు, వౌలిక సదుపాయాలు వంటి వివరాలు ప్రజలకు వివరించేందుకు దేశంలోని 200 ప్రాంతాల్లో వికాస్‌పర్వ్‌ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 7 నగరాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక కేబినెట్ మంత్రి, ఒక మంత్రి, సహాయ మంత్రి, పార్టీ జాతీయ నాయకుడు, రాష్ట్ర నాయకుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ఆయా శాఖల సమాచారం, పత్రికా విలేఖర్లతో సమావేశాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశాలు, అదే రోజు సాయంత్రం బహిరంగ సమావేశం నిర్వహిస్తామన్నారు. బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో వివరించాలని చెప్పారు. దీనికి బిజెపి సానుభూతిపరులు, అభిమానులను ఆహ్వానించాలన్నారు.