ఆంధ్రప్రదేశ్‌

సేవా రంగానిదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: రాష్ట్ర విభజనతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయినప్పటికీ, రెండో ఏడాదికే అద్భుత పురోగతితో పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రెండు రోజులపాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు మంగళవారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా శాఖల అభివృద్ధి గణాంకాలతో కూడిన వివరాలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జివిఎ) నుంచి తలసరి ఆదాయం వరకూ అన్నింటా ప్రగతి కనిపిస్తోందని అన్నారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో 7.30 శాతం వృద్ధి రేటు నమోదైందని ఆయన చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 10.50 శాతం వృద్ధి సాధించడం గమనార్హమని ఆయన అన్నారు. 2015-16లో ఎపిలో మొత్తం స్థూల రాష్ట్ర ఉత్పత్తి 4,55,484 కోట్లు ఉండగా, ఇందులో 2,12,391 కోట్లతో సేవా రంగం ముందుందని అన్నారు. అలాగే 1,21,915 కోట్లతో వ్యవసాయ రంగం రెండో స్థానంలో ఉందని అన్నారు. 1,21,178 కోట్లతో పారిశ్రామిక రంగం మూడో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
2015-16లో మొత్తం రాష్ట్ర వృద్ధిరేటు 10.99 శాతం ఉండగా, ఇందులో సేవల రంగం 11.39 కోట్లతో దూసుకెళ్లిందని చంద్రబాబు తెలియచేశారు. పారిశ్రామిక రంగంలోనూ ఆశించిన స్థాయిలోనే వృద్ధి నమోదైందని అన్నారు. 11.13 శాతం వృద్ధి సాధించడంతో పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్తేజం వచ్చిందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగ వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం శోచనీయమని అన్నారు. ప్రాథమిక రంగంలో 8.40 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధించగలిగామని ఆయన తెలియచేశారు. మొత్తంమీద 2015-16 ఆర్థిక సంవత్సరంలో రైల్వే మినహా అన్ని రంగంలూ అద్భుతమైన ప్రగతిని కనబరిచాయని చెప్పారు. పాలన, ఇతర సేవా రంగాల్లో కూడా రాష్ట్రం తొమ్మిది శాతం వృద్ధి సాధించిందని అన్నారు. రవాణా, గిడ్డంగుల రంగంలో 8.05 శాతం పురోగతి కనిపించిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో 1,40,648 రూపాయలతో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చంద్రబాబు చెప్పారు. 76,638 రూపాయల తలసరి ఆదాయంతో శ్రీకాకుళం జిల్లా ఆఖరి స్థానంలో ఉందని అన్నారు. 1,40,593 రూపాయలతో కృష్ణా జిల్లా రెండో స్థానంలోను, 1,21,724 రూపాయలతో పశ్చిమ గోదావరి జిల్లా మూడో స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు.
రంగాల వారీగా ర్యాంకులు
ఇక వివిధ రంగాల్లో అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని జిల్లాలకు ర్యాంకులు ఇచ్చారు. సేద్యపు రంగంలో పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా రెండో స్థానంలో, తూర్పు గోదావరి మూడో స్థానంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా చివరి స్థానానికి పరిమితమైంది. పశుగణాభివృద్ధిలో కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలు మొదటి, రెండో స్థానంలో ఉన్నయి. కడప చివరి స్థానంలో ఉంది. మండలాల వారీగా జివిఎల నమోదును దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రం చేపట్టిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి సంబంధించి జివిఏలో కృష్ణా జిల్లా కలిదిండి మండలం రాష్ట్రంలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
2016-17లో భారీ లక్ష్యాలు
2016-17కు సంబంధించి అన్ని రంగాల్లో భారీ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది. 6,66,634 కోట్ల జివిఏ సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పారిశ్రామిక రంగంలో 2,02,365 కోట్లు, పరిశ్రమల రంగంలో 1,52,706 కోట్లు, సేవల రంగంలో 3,11,563 కోట్లు ఆర్జించాలని నిర్ణయించింది. సుస్థిరమైన రెండెంకెల వృద్ధి సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు వ్యూహాత్మక కార్యాచరణకు ఉపక్రమించిందని సిఎం చెప్పారు.