రాష్ట్రీయం

స్వర్ణ బార్‌లోనే మద్యం కల్తీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: ఐదుగురిని బలిగొన్న విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్ రెస్టారెంట్‌లోనే మద్యం కల్తీ జరిగినట్లుగా ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా 28 మంది తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. వీరందరూ సేవించిన మద్యం బ్రాండ్లను రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసి వాటి శాంపిల్స్‌ను గుంటూరులోని ప్రాంతీయ ల్యాబ్‌కు, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించటం జరిగింది. అయితే స్వర్ణ బార్ నుంచి సేకరించిన శాంపిల్స్‌లోనే మద్యం కల్తీ జరిగినట్టుగా తేలినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా నివేదికలు రాలేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక ఆధారాలతో బార్ యాజమాన్యానికి చెందిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్‌తో పాటు మరో క్యాషియర్ తాతారావును అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది మీద కేసులు నమోదుకాగా ఇప్పటికి 9మందిని అరెస్టు చేయటం జరిగింది. మరో ముద్దాయి మల్లాది విష్ణు పోలీసులకు అందుబాటులో లేడని తెలుస్తోంది. బార్ లైసెన్స్‌దారులైన నలుగురిపై కేసు నమోదు విషయంపై పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. బార్‌కు సంబంధించిన లైసెన్స్‌ను రద్దుచేస్తూ సంబంధిత ప్రతిని బార్ రెస్టారెంట్ షట్టర్‌కు అంటించడం జరిగింది. సెల్లార్‌లో బార్‌కు అనుమతినిచ్చినందుకు గాను ఆ ప్రాంత ఎక్సైజ్ సిఐ వెంకటరమణను సస్పెండ్ చేయగా ఈ విషయాన్ని పట్టించుకోనందుకు గాను నగరపాలక సంస్థ కార్పొరేషన్ అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ముందుజాగ్రత్తగా కార్పొరేషన్ అధికారులు సెల్లార్‌లో వ్యాపారాలు జరుగుతున్న సంస్థలకు నోటీసులు జారీచేసే ప్రక్రియను ప్రారంభించారు. సెల్లార్‌లోనే అన్ని రకాల వ్యాపార సంస్థలను తక్షణం ఖాళీ చేయించాలని ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన 19 మంది ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా వీరిలో 18 మంది శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. మిగిలిన ఒక్కరికి మెదడులో చిన్న సమస్య వున్నందున ఐసియులో మరికొద్ది రోజులు వుంచాల్సిన అవసరం వుందని డాక్టర్ పివి రమణమూర్తి తెలిపారు. డిశ్చార్జి అవుతున్నవారందరినీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ పరామర్శించారు.