ఆంధ్రప్రదేశ్‌

జూలై 2న విశాఖలో బే మారథాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: విశాఖలో జూలై రెండవ తేదీన సాగర తీరాన బే మారథాన్ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి ఒక వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒక సత్ సంకల్పంతో ఈ మారథాన్‌ను చేపడుతున్నామని అన్నారు. ఈ మారథాన్ ప్రజలకు ఉత్తేజాన్ని, స్ఫూర్తిని ఇస్తుందని అన్నారు. ఆరోగ్యానికి బాట వేసే జీవనశైలిని అలవరుచుకోడానికి ఇటువంటి మారథాన్‌లు తోడ్పడతాయని ఆయన చెప్పారు. ప్రజలంతా ఈ మారథాన్‌ను విజయవంతం చేయాలని సిఎం విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్య చైతన్యాన్ని పెంపొందించడం కోసం డిసీజ్ ఇరాడికేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ (డీప్) సంస్థ చేపడుతున్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. విశాఖలో డీప్ ఆధ్వర్యంలో జరిగే బే మారథాన్‌ను రాత్రి వేళ నిర్వహించనున్నామని అన్నారు. దేశంలో మరెక్కడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించలేదని ది రేస్ డైరక్టర్ నన్నపనేని మురళీధర్ తెలియచేశారు. 21.1కె, 10కె, 5కె, 3కె మారథాన్‌ను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ వెబ్‌సైట్ ఆవిష్కరణలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చంన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యువజన, క్రీడా శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.