తెలంగాణ

చిరుజల్లులకే వణికిన రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు బుధవారం మహానగరాన్ని మరోసారి వణికించాయి. ఉదయం నుంచి ఎండ బాగా మండిపోయి సాయంత్రం అయిదుగంటల తర్వాత ఒక్కసారి ఆకాశం మేఘావృతమై బలమైన గాలులతో వర్షం కురిసింది. కొద్ది సేపే కురిసినా, అపుడే ఆఫీసుల నుంచి ఇంటికెళ్లేందుకు బయటకొచ్చి బస్టాపుల్లో వేచి ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు బలమైన గాలులతో భయానికి గురయ్యారు. అంతేగాక, బుధవారం రాత్రి మరిన్ని ఉరుమలు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందంటూ జిహెచ్‌ఎంసికి సమాచారం అందటంతో జలమండలి, విద్యుత్, రెవెన్యూ, ట్రాఫిక్ వంటి వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన నోడల్ అధికారులు జిహెచ్‌ఎంసిలోని రౌండ్ ది క్లాక్ ఎమర్జెన్సీ కాల్ సెంటర్, కంట్రోల్ రూంకు చేరుకోవాలని కమిషనర్ అప్రమత్తం చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద ఓ చెట్టు విరిగి ఆటోపై పడటంతో ఆటో ధ్వంసమైంది. బుధవారం సాయంత్రం కొద్దిసేపే వర్షం కురిసినా, దానికి తోడు బలమైన గాలులు వీయటంతో 25 ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడినట్లు సెంట్రల్ ఎమర్జెన్సీకి కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా 30 ప్రాంతాల్లో కరెంటు సరఫరా స్తంభించినట్లు అధికారులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ జంక్షన్లలో సుమారు కిలోమీటరు పొడవున ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. వర్షం కురిసి ఆగిన తర్వాత కూడా దాదాపు అరగంట వరకు ట్యాంక్‌బండ్ హోటల్ వైస్రాయ్ వద్ద అటు అంబేద్కర్ విగ్రహం వద్ధ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక లోయర్ ట్యాంక్‌బండ్‌లో సుమారు గంటసేపు రాకపోకలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. పలు చోట్ల జిహెచ్‌ఎంసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

బుధవారం సాయంత్రం పడిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని
ట్యాంక్‌బండ్‌పై కూలిన చెట్లు. స్తంభించిన ట్రాఫిక్