రాష్ట్రీయం

టి.ఎంసెట్‌లో ఆంధ్రా విద్యార్థుల హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: ఎపి ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్ధులు టాప్ 10 ర్యాంకుల్లో ఎక్కువ ర్యాంకులు సంపాదించగా, తాజాగా తెలంగాణ ఎంసెట్‌లో టాప్ 10 ర్యాంకుల్లో ఆంధ్రా అభ్యర్ధులు ఆధిక్యతను ప్రదర్శించారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ -10 ర్యాంకుల్లో ఆరుగురు ఆంధ్రా విద్యార్థులే కాగా, మెడికల్ అగ్రికల్చర్ స్ట్రీంలో టాపర్ ఆంధ్రాకు చెందిన వాడే కావడం గమనార్హం. మెడికల్‌లో ఇద్దరు ఆంధ్రాకు చెందిన వారు టాప్ -10లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు పట్టణానికి చెందిన చంద్రపాల్ రాహుల్ ఇంజనీరింగ్ స్ట్రీంలో ఐదో ర్యాంకు సాధించాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన బండారు వెంకట సాయి గణేష్ ఆరో ర్యాంకు సాధించాడు, విజయనగరం పట్టణానికి చెందిన కొండేటి తన్మయి ఏడో ర్యాంకు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గంటా గౌతమ్ ఎనిమిదో ర్యాంకు, గుంటూరు మంగళగిరికి చెందిన నంబూరు జై కృష్ణ వినయ్ 9వ ర్యాంకు, విశాఖపట్టణం లలితానగర్‌కు చెందిన సత్తివంశీ కృష్ణారెడ్డి 10వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్-మెడికల్ స్ట్రీంలో కడపకు చెందిన బొజ్జ ప్రదీప్‌రెడ్డి ఫస్టు ర్యాంకు సాధించగా, విశాఖపట్టణానికి చెందిన పి శైలజ 9 వ ర్యాంకు సాధించారు.
అగ్రికల్చర్‌లో ప్రదీప్,
ఇంజనీరింగ్‌లో సాయితేజ టాప్
తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన ఎంసెట్‌లో అగ్రికల్చర్ స్ట్రీం టాపర్‌గా బొజ్జ ప్రదీప్ రెడ్డి నిలిచాడు. ఎంసెట్‌లో 160కి 160 మార్కులను సాధించిన ప్రదీప్‌రెడ్డి కడప జిల్లా గాలివీడుకు చెందిన వాడు, రెండో స్థానంలో సామల ప్రత్యూష నిలిచింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రత్యూష ఎంసెట్‌లో 160 మార్కులు సాధించింది. మూడోస్థానంలో కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మహ్మద్ అర్బాజ్, సికింద్రాబాద్‌కు చెందిన వి ప్రణతి నాలుగో స్థానంలో హైదరాబాద్ సైదాబాద్‌కు చెందిన అమ్మకోల యజ్ఞప్రియ ఐదో స్థానంలోనిలిచారు హైదరాబాద్ బహుదూర్‌పురకు చెందిన జీహన్ అహ్మద్ జలీలి 159 మార్కులు సాధించి ఆరోస్థానంలో, హైదరాబాద్ నిజాంపేటకు చెందిన రాజుపాలెం ఉజ్వల్, వరంగల్ కాజీపేటకు చెందిన తంగేడ కౌశిక్ 159 మార్కులతో 8వ ర్యాంకు సాధించారు. విశాఖపట్టణానికి చెందిన పెదిరెడ్ల శైలజ 159 మార్కులతో 9 వ ర్యాంకు సాధించగా, నల్గొండ మిర్యాలగూడకు చెందిన అప్పల శ్రీనిధి 159 మార్కులతో పదో ర్యాంకు సాధించాడు.
ఇంజనీరింగ్ స్ట్రీంలో
హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన తాళ్లూరి సాయి తేజ ఇంజనీరింగ్ స్ట్రీంలో 160 మార్కులతో టాపర్‌గా నిలవగా, మాదాపూర్‌కు చెందిన దిగుమర్తి చేతన్ సాయి 159 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. మాదాపూర్‌కే చెందిన గుండా నిఖిల్ సామ్రాట్ మూడో ర్యాంకు సాధించగా, కొండా విగ్నేష్‌రెడ్డి నాలుగో ర్యాంకు, గుంటూరుకు చెందిన చండూరు రాహుల్ ఐదో ర్యాంకు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన బండారు వెంకట సాయి గణేశ్ ఆరో ర్యాంకు, విజయనగరం తోటపాలెంకు చెందిన కొండేటి తన్మయి ఏడో ర్యాంకు, ఏలూరుకు చెందిన గంటా గౌతమ్ 8వ ర్యాంకు,గుంటూరు మంగళగిరికి చెందిన నంబూరు జై కృష్ణ సాయి వినయ్ 9వ ర్యాంకు, విశాఖ లలితానగర్‌కు చెందిన ఎస్ కృష్ణారెడ్డి 10వ ర్యాంకు సాధించారు.

chitram చండూరు రాహుల్ ఐదో ర్యాంకు