రాష్ట్రీయం

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల కేటాయింపుపై శే్వతపత్రం విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, తమకు కావాల్సిన కాంట్రాక్టులకు ఏకపక్షంగా పనులు కేటాయిస్తూ కోట్లాది రూపాయల నిధుల మళ్లింపుకు టిడిపి ప్రభుత్వం పాల్పడుతోందని వైకాపా తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తింది. శుక్రవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వైకాపా శాసనసభాపక్ష ఉపనేత విశే్వశ్వరరెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం తక్షణమే శే్వతపత్రం ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక కమిటీ టెండర్లను ఖరారు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు కాంట్రాక్టర్లకు పనులను కేటాయిస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టు పనుల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలు, అవినీతి, పనుల కేటాయింపుపై సాంకేతిక కమిటీలోని ఒక సభ్యుడు తన అసమ్మతి తెలియజేస్తూ లేఖ రాశారన్నారు. హంద్రీ నీవా, కుప్పం బ్రాంచి కెనాల్ ప్రాజెక్టు, గాలేరు-నగరి, పట్టిసీమ ప్రాజెక్టుల అంచనాలను కావాలని పెంచి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వానికి దమ్ముంటే గత 18 నెలల పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టు పనులకు నిధుల కేటాయింపుపై శే్వతపత్రం ప్రకటించి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు మర్చిపోయారన్నారు.
విజయవాడలో వాల్‌మార్ట్ కంపెనీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం, ఈ సంస్ధ బ్రాంచిలను ప్రతి జిల్లా, గ్రామంలో నెలకొల్పుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటి నుంచి కులవృత్తులను నమ్ముకుని జీవించే వారు దెబ్బతింటారన్నారు.