రాష్ట్రీయం

రైతుల కోసం రైస్ స్కూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26:వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి, రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైస్ స్కూళ్ల తరహాలో తెలంగాణలో సైతం ఏర్పాటు చేసేందుకు ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు ఆసక్తి చూపించారు. తెలంగాణలో పర్యటించి ఈ విధానం గురించి రైతులకు అవగాహన కలిగేందుకు సహకరించాలని డ్యూపాంట్ సంస్థ ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రెండు రోజుల పాటు పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ సంస్థలతో సమావేశం అయిన కెటిఆర్ మూడవ రోజు పర్యటనలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై దృష్టిసారించారు. వ్యవసాయ ఇన్సూరెన్స్ రంగంలో అపూర్వమైన ప్రగతి సాధించిన ఆయోవా రాష్ట్రంలో పర్యటించిన మంత్రి ఈ రెండు రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు, ఆధునిక పద్ధతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేశారు. ప్రపంచ ఆహార బహుమతి సంస్థ (వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్) అధ్యక్షుడు, అయోవా గవర్నర్‌తో పాటు పలు సంస్థలు, పరిశ్రమ ప్రముఖులతో సమావేశమయ్యారు. నూతన విధానాలతో వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న అయోవా గవర్నర్ టెర్రీ బ్రాన్‌స్టర్డ్‌తో జరిగిన సమావేశంలో ఆ రాష్ట్రంలోని వ్యవసాయ విధానాలను అడిగి తెలుసుకున్నారు. తరువాత డ్యూపాంట్ సంస్థ ప్రతినిధులతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఆయోవాలో రైతులకు సహకరించినట్టుగానే తెలంగాణ రైతులకు సహకరించాలని, నూతన వ్యవసాయ విధానాలను తెలంగాణలో ప్రారంభించాలని డ్యూ పాంట్‌ను కెటిఆర్ కోరారు. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు డ్యూపాంట్ దీనికి సహకరించాలని కెటిఆర్ కోరారు. స్థానిక రైతుల కోసం రైస్ స్కూళ్లను ఏర్పాటు చేసి ఆదర్శ వ్యవసాయ విధానాలు పరిచయం చేయాలని కెటిఆర్ కోరారు. తెలంగాణ రైతులకు ఆర్గానిక్ ఫార్మింగ్ సహకారం అందించాలని, తెలంగాణకు డ్యూపాంట్ ప్రతినిధి బృందాన్ని పంపించాలని కెటిఆర్ కోరారు.అనంతరం అయోవాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కెటిఆర్ ఆ రాష్ట్రంలో వ్యవసాయ ప్రగతికి దోహదం చేసిన వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చించారు.

chitram అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్ అయోవాలో పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమైన దృశ్యం