రాష్ట్రీయం

బాబు రాజకీయాలు, దుర్మార్గాన్ని తిప్పిగొడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజకీయంగా వైకాపాను నిర్వీర్యం చేయాలన్న చంద్రబాబు ఎత్తుగడలను తిప్పిగొడతామని వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో ఆయ న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి బి ఫారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలను కలుషితం చేసే చంద్రబాబు పన్నాగాలను ప్రజలు సహించరన్నారు. రాజకీయాలంటే ప్రజా జీవితానికి సంబంధించినవి అన్నారు. మానవ సంబంధాలను డబ్బుతో విచ్ఛిన్నం చేయాలన్న చంద్రబాబు తాను కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను ముంచడం ఖాయమన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్నారు. రాజధాని ప్రదేశాన్ని తన అనుచరులకు ముందుగా చెప్పి భూములను కారుచౌకగా కొనుగోలు చేయించారన్నారు. రాష్ట్రం ఆర్ధికంగా కటకటలాడుతుంటే ఇష్టం వచ్చినట్లు దుబారా చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఏది తెస్తారో చెప్పకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు కృష్ణా నదిపై ప్రాజెక్టులు నిర్మిస్తే చూస్తూ ఊరుకుంటున్నారని, దీని వల్ల ఆంధ్రలోని సాగునీటి ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కోపం వస్తే ఏమవుతుందోననే భయం చంద్రబాబును వెంటాడుతోందన్నారు.రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయసాయిరెడ్డి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశామని, ఆయన నైతిక విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి అని జగన్ అన్నారు. తనపై వచ్చిన అభియోగాలు నిరాధారమైనవని చెప్పడమే కాకుండా, అసత్యాలు చెప్పనని నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు. విశ్వసనీయతకు తమ పార్టీ స్థానం కల్పిస్తుందన్నారు.
విజయసాయిరెడ్డి నామినేషన్
కాగా, గురువారం ఇక్కడ శాసనసభలో రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఉన్న కార్యదర్శి సత్యనారాయణమూర్తికి విజయసాయిరెడ్డి నామినేషన్ అందించారు. దీనిపై ఎమ్మెల్యేలు జి ఈశ్వరి, నారాయణస్వామి, ముత్యాలనాయు డు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం విజయసాయిరెడ్డి విలేఖర్ల మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభలో గళం విప్పుతానన్నారు. తాను మూడు దశాబ్థాలు చార్టెర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశానని, రాజకీయాల్లో నీతి నిజాయితీగా మెలుగుతానన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు వైఎస్‌ఆర్ పార్టీలో ఉంటానన్నారు.

chitram రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయసాయిరెడ్డి నామినేషన్ వేస్తున్న దృశ్యం