రాష్ట్రీయం

ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు ఒకే యూనిఫామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: పాఠశాల విద్యా స్థాయిలో విద్యార్ధుల మధ్య ఆధిక్యత , న్యూనతా భావాలను నివారించడానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అన్ని స్కూళ్లలో విద్యార్థులకు ఒకే రకమైన యూనిఫామ్ ఉండాలని ప్రతిపాదించింది. ఈ మేరకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకు ఒక ప్రతిపాదనను పంపించింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలోని విద్యార్థులు అందరికీ ఒకే రకమైన యూనిఫామ్ (ఏకరూప దుస్తులు) ఉండాలని, ప్రభుత్వ రంగంలోని రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, కెజిబివిలు సహా అన్ని రకాల పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కూడా సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలను నవోదయ, కేంద్రీయ విద్యాలయాల స్థాయికి అభివృద్ధి చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని మూడేళ్ల నుండి 18 ఏళ్ల వయస్సు పిల్లలకు విస్తరించాలని, అన్ని రాష్ట్రాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థను అమలు చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనలపై విద్యార్ధి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు స్వాగతం పలికాయి. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతిపాదనలు సమర్థనీయంగా ఉన్నాయని తెలంగాణ ప్రజల విద్యా సంస్కరణ ఉద్యమం ప్రధానకార్యదర్శి నాగాటి నారాయణ పేర్కొన్నారు. పాఠశాల విద్యకు సరికొత్త జీవాలను సమకూర్చే సదరు ప్రతిపాదనలను కేంద్ర విద్యాశాఖ ఆమోదించాలని, నూతన విద్యావిధానంలో చేర్చాలని ఆయన సూచించారు.