రాష్ట్రీయం

ఇఫ్లూకు ‘నేక్’ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: హైదరాబాద్‌లోని ఇంగ్లీషు, ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఫ్లూ) కి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నేక్) గుర్తింపు లభించింది. యూనివర్శిటీ ఉన్నత ప్రమాణాలతో పనిచేస్తోందని పేర్కొంటూ నేక్ ఎ గ్రేడ్‌ను ఇచ్చింది. 2000 సంవత్సరంలో నేక్ తొలిసారి ఇఎఫ్‌ఎల్ యూనివర్శిటీకి ఐదు నక్షత్రాల గ్రేడ్ ను ఇచ్చింది. అప్పట్లో ఇఫ్లూ పేరుతో డీమ్డ్ వర్శిటీగా ఉండేది. తర్వాత ఇఫ్లూకు కేంద్రీయ వర్శిటీ హోదా దక్కింది. యూనివర్శిటీలో బోధన, సిబ్బంది, వారి అర్హతలు, పరీక్షల విధానం, విద్యార్థి సౌకర్యాలు, పరిశోధనలు, వౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించేందుకు వచ్చిన 8 మంది సభ్యులతో కూడిన బృందం 3.26 సిజిపిఎతో ఏ గ్రేడ్‌ను ఇచ్చింది. భవిష్యత్‌లో మరింత మెరుగైన సేవలు ద్వారా అంతర్జాతీయ ఖ్యాతికి తాము ప్రయత్నిస్తామని యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ సునైనా సింగ్ పేర్కొన్నారు.