తెలంగాణ

రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: రెండేళ్లలో లక్ష ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, ఇప్పటి వరకు 40 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అయిందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. నీటిపారుదల శాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన ఇంజనీర్లకు నియామక పత్రాలను హరీశ్‌రావు శుక్రవారం అందజేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గొప్ప ఇంజనీరని, దూరదృష్టితో ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ చేపట్టారని, కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే ప్రక్రియలో యువ ఇంజనీర్లు కీలక భూమిక పోషించాలని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో గతంలో ఉన్న ఇపిసి విధానాన్ని తొలగించి జవాబుదారి తనంతో పారదర్శక విధానాలు పాటిస్తున్నట్టు తెలిపారు. సాగునీటి రంగంలో పనులు యుద్ధంలా సాగుతున్నాయని చెప్పారు. పురుషుల కన్నా మహిళా ఇంజనీర్లు గొప్పగా పని చేస్తున్నందున ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పని చేయాలని మహిళా యువ ఇంజనీర్లను కోరారు. ఇరిగేషన్ శాఖలో 242 అసిస్టెంట్ ఇంజనీర్లకు శుక్రవారం జల సౌధలో మంత్రి పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. రెండు జీవనదులు కృష్ణా, గోదావరి ఉన్నా దశాబ్దాల తరబడి తెలంగాణ తాగునీటికి, సాగునీటికి నోచుకోలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ సమస్యలకు ముఖ్యమంత్రి శాశ్వత పరిష్కారం చూపుతున్నారని అన్నారు. కరవు, వలసలు, ప్లోరైడ్ పీడిత ప్రాంతాల విముక్తికి ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ కాకతీయతో పాటు భారీ నీటిప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. భూమి ఉన్నా సాగునీరు లేక వలసలు, ఆత్మహత్యలు సాగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో గ్రామాల రూపు రేఖలు మారుతాయని, రైతుల కళ్లల్లో సంతోషం చూసేందుకు యువ ఇంజనీర్లు చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. ఇంజనీర్లు తమకు పోస్టింగ్ ఇచ్చిన చోటే పని చేయాలని అన్నారు. మిషన్ కాకతీయ కింద 46వేల చెరువులకు పూర్వవైభవం తెచ్చే విధంగా పని చేస్తున్నట్టు చెప్పారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో మన వాటా మనం పూర్తిగా వాడుకుంటామని, పూర్తి వాటాను ఉపయోగించుకునే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు.
కార్యక్రమంలో ఇఎన్‌సి (అడ్మిన్) విజయప్రకాశ్, తెలంగాణ ఇంజనీర్ల జెఎసి అధ్యక్షులు వెంకటేశం, ఇరిగేషన్ ఓఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్‌పాండే , పిఎస్ కె అశోక్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.