తెలంగాణ

ఉద్ధృతమవుతున్న వరంగల్ జిల్లాల లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 27: వరంగల్ జిల్లాలో జిల్లాల ఏర్పాటు లొల్లి ఉద్ధృతమవుతోంది. మొన్నటి వరకు జనగామను జిల్లా కేంద్రంగా చేస్తారని ప్రచారంలో ఉంది. మహబూబాబాద్‌ను కొత్తగా ఏర్పాటయ్యే జనగామ జిల్లాలో కలుపుతారనే ప్రతిపాదనలు ఉండగా మహబూబాబాద్ జెఎసి నాయకులు ఆందోళనలను ఉద్ధృతం చేశారు. జాతీయ రహదారులు, రైల్‌రోకోలతో ఆందోళనలు చేపట్టగా ప్రభుత్వం మహబూబాబాద్‌నే జిల్లా కేంద్రంగా చేయాలని అంచనాకు వచ్చినట్లు తెలియడంతోనే ఇక జనగామవాసులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
జనగామను జిల్లాగా చేస్తూ అందులో జనగామతో పాటు ఆలేరు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలను కలిపి జనగామ జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన మొదటి నుండి ఉండగా మహబూబాబాద్ ఆందోళనతో జనగామ జిల్లా ప్రతిపాదన వెనక్కి పోయింది. దీంతో అన్ని పార్టీల నాయకులు కలిసి శుక్రవారం జనగామ జిల్లా ఐక్య కార్యచరణ సమితిగా ఏర్పాటై ఆందోళనను మరింత ఉద్దృతం చేయనున్నారు. ఈ మేరకు పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావు, జనగామ ప్రాంతానికి చెందిన రాష్ట్ర పర్యాటక సంస్థ డైరెక్టర్ పేర్వారం రాములును కలిసి అఖిలపక్ష నాయకులు జనగామను జిల్లాగా చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. త్వరలోనే ఆందోళనను ఉద్ధృతం చేసే దిశగా ఐక్య కార్యచరణ సమితి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. కాగా జనగామను జిల్లా కేంద్రంగా చేయవద్దంటూ అధికార పార్టీకి చెందిన ఎంపి, ఎమ్మెల్యే గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
జనగామ జిల్లా అవుతుంది: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనగామ జిల్లాగా ఏర్పాటై తీరుతుందని అధికార పార్టీకి చెందిన జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కెసిఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారు. పైగా జనగామ జిల్లా కేంద్రంగా కావడానికి అన్ని విధాలా అర్హతలు ఉన్నాయన్నారు.

ఇప్పటికే తాత్కాళికంగా కలెక్టర్ కార్యాలయం నిర్వహించుకునేందుకు వీలుగా మున్సిపల్ కార్యాలయం ఇరిగేషన్ క్వార్టర్స్ రెడీగా ఉన్నాయని, జనగామ జిల్లా అయినట్లయితే అందుకు సరిపడా తాగునీరు అందించేందుకు గోదావరి జలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే వంద పడకల ఆస్పత్రి జనగామలో ఉందని, అంతేకాకుండా మరో వంద పడకల వెటర్నటీ ఆస్పత్రి కూడా ఇక్కడే ఉందన్నారు. గతకొన్ని సంవత్సరాల కిందటే జనగామలో రెవెన్యూ డివిజన్, పోలీస్ డివిజన్ ఉందని, అంతేకాకుండా హైదరాబాద్, వరంగల్ రెండింటికి మధ్యన ఉన్న జనగామ జిల్లా కావడానికి అన్ని విధాలా అర్హతలు ఉన్నాయన్నారు. మరోవైపు నూతన భవనం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా జనగామ సూర్యాపేట రోడ్‌లో 50 ఎకరాలకు పైగా స్థలం ఉందని, అంతేకాకుండా జనగామ-సిద్దిపేట రూట్‌లో చంపక్‌హిల్స్ వద్ద 175 ఎకరాల సువిశాల ప్రభుత్వ స్థలం ఉందన్నారు. అన్ని అర్హతలు ఉన్న జనగామనే జిల్లాగా అవుతుందనే గట్టి నమ్మకం తనకు ఉందని చెప్పారు.

ఎడ్‌సెట్ ప్రశాంతం
90.5 శాతం పరీక్షకు హాజరు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మే 27: తెలంగాణ రాష్ట్రంలో బిఇడి కోర్సు ప్రవేశాలకై శుక్రవారం నిర్వహించిన ఎడ్‌సెట్ 2016 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కెయు రీజినల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ సరసాని మహేందర్‌రెడ్డి తెలిపారు. కెయు రీజియన్‌లో 37 సెంటర్‌లలో మొత్తం 15,515 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 14,043 మంది హాజరయ్యారని అన్నారు. వరంగల్ 10 సెంటర్‌లలో 4539 మందికి గాను 4,122 మంది హాజరయ్యారని అన్నారు. అదే విధంగా జనగామ రెండు సెంటర్లలో 474 మందికి గాను 441 మంది హాజరయ్యారు. కరీంనగర్ ఏడు సెంటర్లలో 4,225 మందికి గాను 3,767 మంది హాజరు కాగా, ఖమ్మంలో ఆరు సెంటర్లలో 2823 మందికి గాను 2562 మంది హాజరయ్యారు. కొత్తగూడెం మూడు సెంటర్లలో 1214 మందికి గాను 1098 మంది హాజరయ్యారు. నిర్మల్ ఐదు సెంటర్లలో 1104 మందికి గాను 1011 మంది హాజరు కాగా, మంచిర్యాల 4 సెంటర్లలో 1136 మందికి గాను 1042 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. మొత్తంగా 90.5శాతం ఈ పరీక్షకు హాజరయ్యారని అన్నారు. ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజాఅల్త్ఫాహుస్సెన్, ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సరసాని మహేందర్‌రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.రామానుజరావు ఆర్ట్స్ కళాశాలలో పరీక్షల నిర్వాహణ తీరును పరీక్షించారు. అదే విధంగా ఎడ్‌సెట్ కేంద్ర పరిశీలకులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వీరస్వామి, దీప్లా, సిహెచ్ వెంకటేశ్వర్లు నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు.