జాతీయ వార్తలు

వారం రోజుల్లో ఏపి బిజెపికి సారథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెరదించారు. వారం రోజుల్లో ఏపికి కొత్త సారధిని ప్రకటిస్తామని అమిత్‌షా శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బిజెపికి రాజ్యసభ సీటు కేటాయింపుపై తెలుగుదేశం పార్టీతో చర్చ లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. కేంద్రంలో ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా అమిత్‌షా మీడియాతో మాట్లాడారు. ఏపి బిజెపి అధ్యక్షుడి నియామ కం వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో అమిత్‌షా ఈ ప్రకట న చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని, ఆయన నియామకం ఖాయమని కథనాలు వెలువడ్డాయి. అయితే సోము వీర్రాజును రాష్ట్ర పార్టీలోనే ఓ వర్గం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. ఇప్పటి వరకు బిజెపికి రాజ్యసభ సీటు కేటాయిపుపై చర్చలే జరగలేదని టిడిపి చెబుతుండగా అందుకు విరుద్ధం గా అమిత్‌షా ప్రకటన చేయటం గమనార్హం.