రాష్ట్రీయం

విశాఖ పర్యాటకాన్ని వెంటాడుతున్న శాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన విశాఖ నగరానికి పర్యాటకుల తాకిడి గణనీయంగా తగ్గింది. గత ఏడాది హుదూద్ తుపానులో విశాఖ జిల్లాలోని అందమైన ప్రదేశాలన్నీ కనుమరుగయ్యాయి. వాటిలో చాలా వరకూ ఇప్పటి వరకూ పునరుద్ధరణకు నోచుకోలేదు. అంతకు ముందు రెండేళ్లు కూడా పర్యాటక శాఖకు చెందిన ఉద్యోగులు పర్యాటక సీజన్ ప్రారంభమయ్యే సెప్టెంబర్‌లో సమ్మెకు దిగారు. దీంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గడ్ తదితర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ముందుగా బుక్ చేసుకున్న హోటల్ గదుల రిజర్వేషన్లు రద్దయిపోయాయి. బొర్రా గుహలకు కూడా ఆశించిన స్థాయిలో పర్యాటకులు రావడం లేదు. రోజుకు 95 వేల నుంచి లక్ష రూపాయలు మాత్రమే ఆదాయం వస్తోందని అధికారులు చెపుతున్నారు. విశాఖ నగరంలో కూడా పెద్దగా పర్యాటక ప్రదేశాలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. దీనిపై ఇటీవల ఉన్నత స్థాయి అధికారులు సమీక్ష నిర్వహించారు. గోవా, సింగపూర్, థాయిలాండ్, మలేషియా వంటి ప్రాంతాలకు పర్యాటకులు ఎందుకు పెద్ద ఎత్తున వెళుతున్నారు? విశాఖకు ఎందుకు రావడం లేదన్న అంశంపై చర్చించారు. విశాఖలో పర్యాటక ప్రాజెక్ట్‌లు నెలకొల్పడానికి ఉన్న ఆంక్షలే కారణమని నిర్థారించుకున్నారు. పని వత్తిడితో సతమతమయ్యే వారు సెలవు దినాల్లో ఉల్లాసంగా గడిపేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళతారు. అటువంటి వారిని ఆకట్టుకునే ప్రదేశాలు కానీ, ప్రాజెక్ట్‌లు కానీ ఇక్కడ లేకపోవడం కూడా పర్యాటకుల తాకిడి తగ్గడానికి కారణమని గుర్తించారు. చాలా కాలంగా విశాఖలో కాసినోవాను ఏర్పాటు చేయాలని చాలా మంది కోరుతున్నారు. ఐటి సంస్థలతోపాటు, పలు కార్పొరేట్ సంస్థలు కూడా దీని గురించి డిమాండ్ చేస్తున్నాయి. కనీసం బీచ్ ఒడ్డున వాటర్ వరల్డ్ ఏర్పాటు చేయాలన్నా సిఆర్‌జెడ్ నిబంధనలు అడ్డొస్తున్నాయి. విశాఖకు పర్యాటక పరంగా 10 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు వస్తున్నాయని గత ఐదేళ్ల నుంచి స్థానిక మంత్రులు, ముఖ్యమంత్రులు చెప్పుకొస్తున్నారు. అందులో కనీసం వంద కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కూడా ఇక్కడికి రాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్యాటక శాఖలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు భారీ సదస్సు నిర్వహించింది. టిడిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొద్ది రోజుల కిందట ఒక సదస్సు నిర్వహించింది. తిరిగి చూస్తే, రూపాయి పెట్టుబడి కూడా ఇక్కడికి రాలేదు.
విశాఖ వచ్చే పర్యాటకులు జూకు వెళదామంటే, అక్కడ నీరసించిన, జీవశ్ఛవాల్లా ఉన్న జీవులే దర్శనమిస్తాయి. జూకు వెళ్లిన వారు ఉసూరుమని తిరిగొస్తున్నారు. పోనీ జంతు సంరక్షణ శాలలో ఉన్న పులులు, సింహాలను పర్యాటకులకు చూపిద్దామంటే, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డు వస్తున్నాయి. విశాఖ పోర్టు, స్టీల్ ప్లాంట్ వంటివి చూపెట్టాలంటే భద్రత పరంగా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
అధికారి, నిధులు..అంతా అరకొరే!
ఇక విశాఖలోని పర్యాటక శాఖ కార్యాలయానికి గత పదేళ్ల నుంచి పూర్తి స్థాయి అధికారి లేరు. రెండు, మూడు నెలల కిందటే ఒక అధికారిని నియమించి, విశాఖలో పర్యాటక అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు కేటాయించారంటే ప్రభుత్వం ఈ శాఖపై ఎంత ఉదారంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ఉత్సవాలతో ఒరిగేది లేదు!
ఇక ఏటా డిసెంబర్‌లో విశాఖ, అరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీనివలన పర్యాటకులను ఆకర్షించే అవకాశం లేదని ఆశాఖ అధికారులే చెపుతున్నారు. ఆ మొత్తాన్ని పర్యాటకుల కోసం ఖర్చు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఉత్సవాలకు బదులు, మూడు రోజులపాటు విశాఖ జిల్లాకు వచ్చే పర్యాటకులకు స్పెషల్ డిస్కౌంట్ ప్యాకేజీలు ఇస్తే బాగుంటుందని చెపుతున్నారు.