రాష్ట్రీయం

సిఎంకు నిరుద్యోగుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు,డిసెంబర్ 11: నరసరావుపేట పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న డిఎస్సీ-2014 నిరుద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ వాతావరణంలో కార్యక్రమం జరుగుతున్న సమయంలో కొద్దిమంది, ఐదారుగురు స్వార్ధపరులు వాతావరణాన్ని కలుషితం చేయాలనే ఉద్దేశంతో ప్లకార్డులు ప్రదర్శించడం సరికాదన్నారు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. క్రమశిక్షణ లోపించింది. అయినప్పటికీ వారు ఏమీ చేయలేరు. తమ్ముళ్లూ.. ఊరుకోండి, వారి మీదకు వెళ్లద్దంటూ కోరారు. అంతే కాకుండా ప్రభుత్వం ఉంది ప్రజల సమస్యలు తీర్చడానికే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్న సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ జోక్యం చేసుకొని అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. దుర్మార్గంగా కొందరు ఎలాగ ఉంటారంటే.. ఇంత పెద్దపండుగ జరుగుతుంటే కొందరు వచ్చి ప్లకార్డులు పట్టుకుంటే మన ఆలోచన పక్కకు మళ్లుతుందని, అందువల్ల ఎవరూ అటువైపు చూడ వద్దుంటు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలను ఆదేశించారు. డిఎస్సీ-2014 విద్యార్థులు పరిక్షలు రాసి క్వాలీఫై అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వక పోవడాన్ని ఆక్షేపిస్తూ ప్లకార్డు ప్రదర్శించారు. ప్లకార్డుల్లో జాబులు ప్రకటించండి, కుంటి సాకులు చూపవద్దు, కోర్టు కేసులు బూచిగా చూపవద్దు నిరుద్యోగులు ప్రదర్శించారు. పోలీసులు జోక్యం చేసుకుని నిరుద్యోగులను శాంతింప జేశారు.

ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న డిఎస్సీ-2014 నిరుద్యోగులు