రాష్ట్రీయం

మహానాడు క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో ఇంజనీర్లు కమీషన్లు తీసుకుంటున్నారని తిరుపతిలో జరిగిన మహానాడులో టిడిపి చేసిన ఆరోపణలపై తెలంగాణ ఇంజనీర్ల జెఎసి నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సచివాలయంలో శనివారం వారు మీడియా పాయింట్ వద్ద విలేఖర్లతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ప్రధాన మంత్రితో సహా పలువురు అభినందించారని తెలిపారు. ఈ పథకాలను విజయవంతంచేసి ఇంటింటికీ మంచినీరు అందించేందుకు ఇంజనీర్లు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల్లో పూడిక తీసివేసే పనులను ఉద్యమంగా సాగిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని శక్తివంచన లేకుండా పని చేస్తున్న తెలంగాణ ఇంజనీర్లను అవమానించే విధంగా మహానాడులో ఆరోపణలు చేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంలో టిడిపి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిడిపి నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని, తెలంగాణ ఇంజనీర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని వారు అన్నారు.