రాష్ట్రీయం

విదేశీ రుణాలపై కుదరని సయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: రాష్ట్ర విభజన జరిగి మరో నాలుగు రోజుల్లో రెండేళ్లు గడుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాజెక్టుల కోసం విదేశీ ఏజెన్సీల నుంచి తీసుకున్న రుణాన్ని ఏ రాష్ట్రం చెల్లించాలనేది ఇంతవరకు తేలలేదు. ఈ అంశాన్ని ఇరు రాష్ట్రాలు కూర్చుని పరిష్కరించుకోవాలని కేంద్రం సలహా ఇస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సయోధ్యతో ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్, మరికొన్ని ఇతర ప్రాజెక్టులను చేపట్టారు. వీటి కోసం విదేశాల నుంచి దాదాపు 10 వేల కోట్ల రుణం తెచ్చారు. ఈ రుణాన్ని జనాభా నిష్పత్తి ప్రకారం సర్దాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, ఇందుకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించడం లేదు. హైదరాబాద్ నగరం చుట్టూ మణిహారం లాంటి 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు పనులు తెలంగాణలోనే కొనసాగుతున్నందున వీటికి సంబంధించిన రుణాలను ఆ రాష్టమ్రే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. కాగా, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తమకూ వాటా ఉందని, కానీ తమకు విద్యుత్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ నిరాకరించిందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రం రుణం 1.66 లక్షల కోట్లుగా ఉండేది. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) కసరత్తు చేసి ఇరు రాష్ట్రాలకు రుణాలను జనాభా ప్రకారం పంచారు. ఈ ఫార్ములాను కాగ్‌తో పాటు కేంద్రం కూడా ఆమోదించింది. అయినప్పటికీ మరో 18 వేల కోట్ల రూపాయల రుణం పెండింగ్‌లో ఉంది. వీటిలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్రం రుణాలు. 2015 జూన్ నుంచి గత ఏడాది అక్టోబర్ వరకు నెలకు రూ.150 కోట్ల రుణాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించింది. గత ఏడాది నవంబర్‌లో కాగ్ రూ. 8000 కోట్ల కేంద్ర రుణాలను కూడా జనాభా నిష్పత్తి ప్రకారం పంచింది. అప్పటివరకూ ఈ 8 వేల కోట్ల రూపాయలపై చెల్లించిన వడ్డీని తెలంగాణ ప్రభుత్వం తమకు ఇవ్వలేదని ఏపి ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. కేంద్ర రుణాలు ఒక కొలిక్కి వచ్చాయనుకుంటే అభివృద్ధి ప్రాజెక్టుల రుణాలు పది వేల కోట్లరూపాయలపై నలుగుతున్న సమస్య కొలిక్కి రాలేదు. ఈ రుణంలో కృష్ణపట్నం మినహాయించి మిగిలిన తెలంగాణలో ప్రాజెక్టులకు విదేశాలు ఇచ్చిన రుణాలను తెలంగాణ ప్రభుత్వం భరించాలని ఏపి కోరుతోంది. అలాగే 2014 నుంచి గత ఏడాది అక్టోబర్ వరకు రుణాలపై చెల్లించిన రూ.1000 కోట్ల వడ్డీని తెలంగాణ చెల్లించాలని ఏపి ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.