ఆంధ్రప్రదేశ్‌

ఇంకుడుగుంత తప్పనిసరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 30: రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఇక నుంచి నిర్మించబోయే ప్రతీ భవనంలో ఇంకుడుగుంత తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సోమవారం అదేశించింది. ఆ ఇంకుడుగుంతను జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. భవన నిర్మాణానికి సంబంధించిన ఆమోదం కోసం సమర్పించే ప్లాన్‌లోనే ఇంకుడుగుంత ఎక్కడ నిర్మించేదీ చూపించాల్సి ఉంటుంది. 100 చదరపు మీటర్ల శ్లాబ్ కలిగిన ప్రతీ ఇంటికి 6 క్యూబిక్ మీటర్ల గుంతను ఏర్పాటుచేసి, దాన్ని జియోట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో బహుళ అంతస్తుల భవనాల వద్ద ఇంకుడుగుంతలు తీయడం, వాటిని పునరుద్ధరించే పనిని పట్టణ ప్రణాళిక విభాగానికి అప్పగించారు. ఉద్యానవనాలు, క్రీడామైదానాలు, ఖాళీ ప్రదేశాల్లో తీసే గుంతల బాధ్యతలను కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లకు ప్రభుత్వం అప్పగించింది. తీసే ప్రతీ గుంతనూ ఇక నుండి జియోట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. వీటి వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం చేస్తున్నారు. అందుకు అధికారులు ప్రత్యేకంగా ట్యాబ్‌లు కూడా వినియోగిస్తున్నారు.
పదిహేనేళ్ల క్రితమే ఆదేశాలు!
ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడుగుంతను ఏర్పాటుచేసుకోవాలని 2000వ సంవత్సరంలోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పట్టణాల్లో ఇంకుడుగుంతలను అప్పట్లోనే తప్పనిసరి చేశారు. అయితే తర్వాత ఈ అంశాన్ని అందరూ మర్చిపోయారు. నీటి కొరత పెరిగిపోతూ, భూగర్భ జలాలు అడుగంటిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి నీటిచుక్కను ఒడిసిపట్టాలనే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఇంకుడుగుంతలను ప్రోత్సహిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పట్టణాల్లో కొత్తగా నిర్మించబోయే భవనాలకు ఇంకుడుగుంతలు తప్పనిసరిచేస్తూ ఈ ఏడాది మరోసారి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం పురపాలక సంఘంలోని ప్రణాళిక విభాగం ఈ పనుల్లో నిమగ్నమైంది.

చిత్రం... జియో ట్యాగింగ్ కోసం ఫొటో తీస్తున్న అధికారులు