రాష్ట్రీయం

మధ్యంతర ఉత్తర్వుల సమీక్షపై తీర్పు రిజర్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలను చేపట్టాలని జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సమీక్షించాలని దాఖలైన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసినట్లు హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. హైకోర్టు విభజన జరిగే వరకు న్యాయాధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని సీనియర్ న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. నియామకపు ఉత్తర్వులు జారీ చేయడానికి సమయం పడుతుందని, తుది ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని పేర్కొన్నామని కోర్టు తెలిపింది. న్యాయాధికారుల నియామకాన్ని సమీక్షించాలని దాఖలైన పిటిషన్‌పై త్వరలోనే నిర్ణయాన్ని వెలువరిస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

విద్యారంగంలో
సమూల సంస్కరణలు
కెరీర్‌పై టెన్త్ నుండే సిలబస్

హైదరాబాద్, డిసెంబర్ 11: పాఠశాల విద్యాస్థాయి నుండి ఉన్నత విద్య, యూనివర్శిటీ విద్య వరకూ సమూల సంస్కరణలకు ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ప్రధానంగా పాఠశాల విద్యను పటిష్ఠం చేయడం ద్వారా ఉన్నత స్థాయికి నైపుణ్యం, జవాబుదారీతనం, సామాజిక స్పృహ ఉన్న యువతను పంపించేందుకు వీలుగా నైతిక విలువలు మొదలు సామాజిక సున్నితత్వం పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంది. ఈ క్రమంలో ఇటు ఎన్‌జిఓలను, కార్పొరేట్ కంపెనీల సహకారాన్ని కూడా తీసుకోవాలని చూస్తోంది. టెన్త్ నుండే విద్యార్థులకు కెరీర్ కౌనె్సలింగ్ అందించేలా సిలబస్‌లో మార్పు చేస్తారు. విద్యాబోధన తరగతి గదికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. జర్మనీ విద్యాబోధన తరహాలో రాష్ట్రంలోనూ జరిగేందుకు అవసరమైన చర్యలను తీసుకోబోతున్నారు. 27 కార్పొరేట్ కంపెనీలు 100 కళాశాలలను అభివృద్ధి చేయనున్నాయి. ఈ కార్యక్రమానికి టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్‌కు చెందిన ఆచార్య పరశురామన్ నేతృత్వం వహిస్తారు. ప్రతి కళాశాల నుండి పట్ట్భద్రులైన వారు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా పారిశ్రామిక ఔత్సాహికతను అలవరచుకునేలా సిలబస్‌లోనే తగిన తర్ఫీదు ఇస్తారు. కాలేజీల్లో మొక్కుబడిగా జరిగే వార్షిక దినోత్సవాలను ఇక నుండి ఎకనామిక్, అకడమిక్, యాక్టివిటీస్ దినోత్సవాలుగా నిర్వహిస్తారు.

సెంట్రల్ యూనివర్శిటీలో రెండోసారి యునెస్కో పీఠం

హైదరాబాద్, డిసెంబర్ 11: సెంట్రల్ యూనివర్శిటీలో కమ్యూనిటీ మీడియా పేరిట యునెస్కో పీఠాన్ని 2019 వరకూ రెండోదఫా పునరుద్ధరించింది. సెంట్రల్ యూనివర్శిటీ డిపార్టుమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ పీఠాన్ని నిర్వహిస్తోంది. ఆ విభాగం అధిపతి ప్రొఫెసర్ వినోద్ పవరాల దీని నిర్వహణా బాధ్యతలు చూస్తున్నారు. కమ్యూనిటీ రేడియో, భాగస్వామ్య వీడియోలు, పౌర నియంత్రణ పత్రికలు నిర్వహణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ పీఠానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.
దూరవిద్య ద్వారా ప్రత్యేక కోర్సులు
దూర విద్య ద్వారా పిజి డిప్లొమో కోర్సులకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రాజెక్టు మేనేజిమెంట్, బిజినెస్ మేనేజిమెంట్, సైబర్‌లా, ఫోరెన్సిక్ సైన్స్, కెమికల్ అనాలసిస్, హ్యుమన్ రైట్స్, లైబ్రరీ ఆటోమేషన్, నెట్ వర్కింగ్, కమ్యూనికేటివ్ ఇంగ్లీషు, మెడికల్ బోటనీ, ఎనర్జీ మేనేజిమెంట్ తదితర కోర్సులకు దరఖాస్తులను ఆబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్‌లోని దూరవిద్యా కేంద్రంలో పొందవచ్చని వర్శిటీ అధికారులు తెలిపారు. ఇతర సమాచారం కోసం 040-24600264 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని అన్నారు.